ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రపంచ వైమానిక కేంద్రంలో నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకునేందుకు మరో భారీ కట్టడానికి దుబాయ్ సిద్ధమవుతోంది. దుబాయ్‌లోని వరల్డ్ సెంట్రల్‌కు అతి సమీపంలో ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది.

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించనున్న ఈ ఎయిర్ పోర్టు కోసం 3,200 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ఎయిర్ పోర్టులో ఏ380 విమానాలు టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా, 4.5 కిలోమీటర్ల పొడవుతో మొత్తం 5 రన్ వేలు ఏర్పాటు చేయనున్నారు.
తొలి దశలో 12 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే ఈ విమానాశ్రయం, 2020కల్లా 20 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ కార్పోరేట్ కమ్యూనికేషన్స్ అధిపతి జులియిస్ బామన్ తెలిపారు. ప్రస్తుతం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో కెల్లా రెండవ అతిపెద్ద బిజీగా ఉన్న విమానాశ్రయం అక్టోబర్ 27, 2013న ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications