తోటి మహిళలే : న్యూడ్ వీడియో తీసి.. బ్లాక్ మెయిల్

దుబాయ్ : మహిళలయి ఉండి సాటి మహిళ పట్ల అమానవీయ ధోరణిలో ప్రవర్తించి, ఆమెను చిత్రవధకు గురిచేశారు దుబాయ్ కి చెందిన ముగ్గురు మహిళలు. ఈజీ మనీ కోసం యువతిని కిడ్నాప్ చేసిన సదరు మహిళలు యువతిని నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి, ఆ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ బాధిత యువతి సోదరుడి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు.

అయితే.. విషయం కాస్త పోలీసులకు చెవిన పడడంతో, రంగ ప్రవేశం చేసిన పోలీసులను సదరు మహిళా కిడ్నాపర్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో నివాసముంటున్న ఓ మేనిక్యూరిస్ట్‌ (29) అల్ నహ్దా ప్రాంతంలో ట్యాక్సీ కోసం ఎదురుచూస్తుండగా.. యువతి కదలికలను గమనించిన ఓ మొరాకో మహిళ, ఈజిప్షియన్ వ్యాపారవేత్త ఆమెను కిడ్నాప్ చేశారు.

అనంతరం ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న తమ ఫ్లాట్ కి తీసుకెళ్లి ఆమెను వేధింపులకు గురిచేశారు. యువతి బట్టలను చించేసి ఆమె నగ్న చిత్రాలను మొబైల్ లో చిత్రీకరించారు. ఆ చిత్రాలను ఇటలీలో ఉండే బాధితురాలి సోదరుడికి పంపించి 2.58 మిలియన్ దిర్హమ్స్ డబ్బులు ఇస్తేనే యువతిని వదిలిపెడుతామంటూ బ్లాక్ మెయిలింగ్ కి దిగారు. దుబాయ్‌లో గతేడాది సెప్టెంబరు 19న చోటు ఈ ఘటన చేసుకుంది.

ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే.. కిడ్నాప్ చేసిన యువతిని చంపేస్తామని, ఆమె న్యూడ్ వీడియోను ఆన్ లైన్ లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చేసేదేమి లేక బాధిత యువతి సోదరుడు తనకు రెండు రోజుల గడువు కావాల్సిందిగా కిడ్నాపర్లను కోరాడు. తర్వాత సోదరి కిడ్నాప్ విషయాన్ని దుబాయ్‌లో ఉంటున్న తన స్నేహితులకు అదే రోజు చేరవేశాడు.

dubai court ordered for three years jail to women kidnapers

దీంతో అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కిడ్నాపర్లు వాట్సాప్ ద్వారా యువతి సోదరుడికి పంపించిన వీడియో ఆధారంగా ఆ ఫ్లాట్‌ను కనుగొని నిందితుల ఆట కట్టించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని బాధిత యువతిని చికిత్స నిమిత్తం లతీఫా ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే, గతేడాది జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి కోర్టు తాజాగా తుది తీర్పు వెల్లడించింది. నిందితులను దోషులుగా ప్రకటించిన కోర్టు మూడేళ్ల జైలు శిక్షల విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కిడ్నాపర్లకు సహకరించిన మరో ఇద్దరు మహిళలకు రెండేళ్లు, ఇద్దరు పురుషులకు ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది కోర్టు. నిందితుల శిక్ష కాలం పూర్తయిన తర్వాత వీరిని దేశం నుంచి బహిష్కరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+