ట్రయల్ రూమ్‌లో బట్టలు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తూ దొరికిపోయాడు

Subscribe to Oneindia Telugu

దుబాయి: షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు ట్రయల్ రూమ్‌లో ఏమరపాటుగా ఉంటే ఊహించని డ్యామేజ్ జరగడం ఖాయం. తాజాగా ఓ మాల్‌లో దుస్తులు కొనుగోలు చేసిన మహిళ.. ట్రయల్ రూమ్‌లో వాటిని మార్చుకుంటుండగా.. ఎవరో కెమెరాతో చిత్రీకరించడం గుర్తించింది. అంతేకాదు, అప్పటికప్పుడు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకుంది.

దుబాయిలోని ఓ షాపింగ్ మాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన 34ఏళ్ల ఓ మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటుండగా డోర్‌కు ఓ రంధ్రం ఉన్నట్లు గమనించింది. రంధ్రంలోంచి ఎవరో వీడియో షూట్ చేస్తున్నట్లు కనిపించడంతో.. వెంటనే బయటకు దూసుకొచ్చంది.

dubai woman founds man secretly recording women dress changing in trail room

డోర్ బయట సెల్‌ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తున్న పాతికేళ్ల యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గతంలోను ఆ యువకుడు ఇలా ప్రవర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి దుబాయి కోర్టు జూన్11న తీర్పు వెలువరించనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in Dubai faced a bad experience in local shopping mall. While she was changing dress in trail room, an unknown person was shooted with cellphone
Please Wait while comments are loading...