వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం:చుట్టూ తిరిగే భవనం, ఫ్లోర్ ను తిప్పుకోవచ్చు

దుబాయ్ లో మరో అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని మరిపించేలా తన చుట్టూ తాను తిరిగే కట్టడాన్ని నిర్మిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

దుబాయ్:దుబాయ్ లో మరో అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని మరింపించేలా మరో అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తున్నారు.

ఎత్తైన భవనంలో హయిగా వరండాలో కూర్చోని సూర్యోదయం ఎవరికైనా చూసే ఉంటారు. అయితే అదే వరండాలో కూర్చోన్న చోట నుండే సూర్యాస్త సమయాన్ని కూడ వీక్షించేలా ఓ భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని త్వరలో చూసే వీలుంది.

దుబాయ్ లోని డైనమిక్ టవర్ హోటల్ లో ఒ:క్కో అంతస్థులో దేనికదే ప్రత్యేకంగా అంతస్తులను నిర్మిస్తున్నారు. ముందుగా మధ్య బాగంలో ఎత్తైన కాంక్రీట్ నిర్మాణాకి వేరే చోట తయారు చేసిన యానిట్లను అతికిస్తున్నారు.

Dubai: Would-be home to world’s first rotating skyscraper

భారీ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. తన చుట్టూ తానే తిరిగేలా ఉన్న ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మాణ రంగంలో ఓ నూతన అధ్యాయంగా చెప్పే అవకాశం ఉంది.

గాలి మరలు, సౌరపలుకల సహయంతో ఈ భవంతికి అవసరమైన విద్యుత్ ను స్వంతంగా ఉత్పత్తి చేసుకోవడం దీని మరో ప్రత్యేకత. వాయిస్ ఆక్టివేటేడ్ కమాండ్ సిస్టమ్ తో ఆ గదుల్లో బసచేసేవారు తమ ఇష్టానుసారంగా ప్లోర్ ను తిప్పేసే అవకాశం ఉంది.

ఒక్కో ఫ్లోర్ యూనిట్ల వారీగా గదులను నిర్మించారు. 1,375 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవంతిలో మొత్తం 80 అంతస్తులను నిర్మిస్తున్నారు.ఖరీదైన హోటల్ లో బస చేసేందుకు వచ్చే కస్టమర్లు ఓ కొత్త అనుభూతిని పొందే అవకాశం ఉందని డైనమిక్ గ్రూప్ చెబుతోంది.విలాసవంతమైన హోటల్ లో ఉండే అన్ని రకాల సదుపాయాలన్నీ ఈ భవంతిలో ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది.

అయితే కొన్ని ఫోర్లలోని యూనిట్లను ప్రత్యేకంగా అపార్ట్ మెంట్లుగా వాడుకొనేలా నిర్మిస్తున్నారు. అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ భవంతిలోని ఒక్కో అపార్ట్ మెంట్ ప్రస్తుత విలువ దాదాపుగా రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ ధర పెరిగే అవకాశం కూడ లేకపోలేదు.

తొమ్మిదేళ్ళ క్రితమే ఇజ్రాయిలీ ఇటాలియన్ ఆర్కిటెక్ట్ డేవిడ్ ఫిషర్ రూపకల్పన చేశాడు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించిన మరిన్ని విషయాలను మాత్రం ఫిషర్ చెప్పడం లేదు. 2008 నుండి ఈ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే 2020 వరకు ఈ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

English summary
Dubai will soon have the world’s first rotating skyscraper in the world.The idea for the revolutionary tower first made its debut back in 2008, but The educational channel Your Discover Science posted a three-minute video online on February 9, 2017, as Italian architect David Fisher was interviewed on Dubai’s newest project, the Dynamic Tower.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X