వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Video: నడి సముద్రంలో డచ్‌ కార్గో షిప్‌కు ఊహించని ప్రమాదం.. సేఫ్‌గా బయటపడ్డ 12 మంది సిబ్బంది...

|
Google Oneindia TeluguNews

నార్వేజియన్ సముద్రంలో ఓ డచ్ కార్గో షిప్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తుఫాన్ ప్రభావంతో భారీగా వీచిన ఈదురు గాలులకు షిప్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పూర్తిగా అదుపు తప్పిన షిప్ మునిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. షిప్‌లో ఉన్న 12 మంది సిబ్బందిని హెలికాప్టర్‌ ద్వారా రక్షించారు.

నార్వేజియన్ సముద్రంలో ఉత్తరం వైపు 130 కి.మీ దూరంలో 'ఈమ్‌స్లిఫ్ట్ హెండ్రికా' షిప్ చిక్కుకుపోయినట్లు నార్వే అధికారులు వెల్లడించారు. షిప్‌ ప్రధాన ఇంజన్‌లో విద్యుత్ సప్లై నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. షిప్ మునిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

Dutch Cargo Ship Adrift off Norway twelve crew rescued

షిప్‌లో ఉన్న 12 మంది సిబ్బందిని రెండు విడతల్లో హెలికాప్టర్‌ ద్వారా రక్షించారు. మొదట 8 మందిని హెలికాప్టర్‌ ద్వారా షిప్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే షిప్ పూర్తిగా అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయేలా కనిపించింది. దీంతో షిప్‌లో మిగిలిపోయిన నలుగురు సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. కాసేపటికి హెలికాప్టర్ ద్వారా వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

హెండ్రికా షిప్ జర్మనీలోని బ్రెమర్‌హవెన్‌ నుంచి నార్వేలోని కొల్వరిడ్‌కు చిన్న పడవలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ ప్రభావంతో వీచిన భారీ గాలులకు షిప్‌లోని కొన్ని బోట్లు సముద్రంలో పడి కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను నార్వే అధికారులు విడుదల చేశారు.

షిప్‌లో 350 క్యూబిక్ మీటర్ల ఇంధనంతో పాటు 75 క్యూబిక్ మీటర్ల డీజిల్,10 క్యూబిక్ మీటర్ల లూబ్రికేటింగ్ ఆయిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. షిప్ మునిగిపోతే ఈ ఇంధనమంతా సముద్రంలో కలిసే అవకాశం ఉంది. అదే జరిగితే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

English summary
A Dutch cargo ship is adrift in the Norwegian Sea after all of its crew members were airlifted, with some having to jump into the rough waters to be rescued.The Eemslift Hendrika, which was carrying several smaller boats from Bremerhaven in Germany to Kolvereid in Norway, made a distress call Monday, reporting a heavy list after stormy weather displaced some of its cargo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X