ఆన్ లైన్ ప్రేమ హ్యాండిచ్చింది: ఎయిర్ పోర్టులో తిష్ట

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: ఆన్ లైన్ లో పరిచయం అయిన ప్రియురాలిని కలుసుకోవడానికి వెళ్లిన ఓ భగ్న ప్రేమికుడు చివరికి ఆసుపత్రిపాలైనాడు. ఆమె ఇప్పట్లో తిరిగిరాదని అధికారులు చెప్పి అతనిని ఒప్పించి సొంత ఊరికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రియురాలి కోసం 4,500 కిలో మీటర్ల దూరం ప్రయాణించిన ఆ ప్రేమికుడు 10 రోజుల పాటు పగలు, రాత్రి ఎయిర్ పోర్టులో కుర్చుని అనారోగ్యానికి గురైనాడు. ఎప్పటికైనా తాను ఆన్ లైన్ ప్రియురాలిని కలుసుకుంటానని నమ్మకంతో ఉన్నాడు.

నెదర్లాండ్ లో నివాసం ఉంటున్న అలెగ్జాండర్ పీటర్ కిర్క్ (41), చైనా లో నివాసం ఉంటున్న జాంగ్ (29) ఆన్ లైన్ లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కుదిరాయి. వీరి పరిచయం ఆన్ లైన్ లోనే ప్రేమగా మారింది.

జులై నెలలో అలెగ్జాండర్ తన ప్రియురాలికి ఓ సందేశం పంపించాడు. నిన్ను చూడకుండా నేను ఉండలేను వెంటనే బయలుదేరి వస్తున్నానని అతను తీసుకున్న విమానం టిక్కెట్ ఫోటో తీసి ఆమెకు పంపించాడు.

ఆన్ లైన్ ప్రేమ

ఆన్ లైన్ ప్రేమ

వెంటనే 4,500 కిలో మీటర్ల దూరం ఉన్న జాంగ్ సొంత ఊరైన మధ్య చైనాలోని హునన్ ఫ్రావిన్స్ లోని చంగ్ షా చేరుకున్నాడు. అక్కడ ప్రియురాలు కనిపించకపోవడంతో నిరాశ చెందాడు. ఆమె బిజీగా ఉంటుందని, వచ్చేస్తుందని అనుకుని అక్కడే ఉన్నాడు.

ఆన్ లైన్ ప్రేమ

ఆన్ లైన్ ప్రేమ

ఎయిర్ పోర్టు అధికారులు అలెగ్జాండర్ దగ్గరకు వెళ్లి ఆరా తీశారు. తన ప్రియురాలు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని, దయచేసి సహకరించాలని ఎయిర్ పోర్టు అధికారులకు మనవి చేశాడు. విషయం మీడియాకు తెలిసింది.

ఆన్ లైన్ ప్రేమ

ఆన్ లైన్ ప్రేమ

వెంటనే టీవీ చానెల్స్, దినపత్రికలు అతనిని ఇంటర్వూ తీశారు. ప్రియురాలి ఫోటోలు, అలెగ్జాండర్ ఫోటోలను చైనీస్ పత్రికలు ముద్రించాయి. విషయం తెలుసుకున్న జాంగ్ షాక్ కు గురైయ్యింది. ఫ్లైట్ టిక్కెట్ ఫోటో తీసి పంపించాడని మీడియాకు చెప్పింది.

 ఆన్ లైన్ ప్రేమ

ఆన్ లైన్ ప్రేమ

అయితే అతను చైనా వస్తాడని తాను ఊహించలేదని, ఇప్పుడు అతనిని కలవలేనని జాంగ్ తేల్చి చెప్పింది. మొదట మా ప్రేమ బాగానే ఉందని, తరువాత అలెగ్జాండర్ తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో దూరం అయ్యానని చెప్పిందని సీసీ టీవీ న్యూస్ పేర్కొంది.

 ఆన్ లైన్ ప్రేమ

ఆన్ లైన్ ప్రేమ

ప్లాస్టిక్ సర్జరీ కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన జాంగ్ ఇప్పట్లో తిరిగిరాదని ఎయిర్ పోర్టు అధికారులు అలెగ్జాండర్ కు నచ్చ చెప్పారు. 10 రోజులు కావడంతో అనారోగ్యంతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు.

 ఆన్ లైన్ ప్రేమ

ఆన్ లైన్ ప్రేమ

ఎయిర్ పోర్టులో దిగినప్పడు స్టైల్ గా ఉన్న అలెగ్జాండర్ ఇప్పుడు అనారోగ్యానికి గురి కావడంతో చిక్కిపోయాడు. అతనిని సొంత ఊరికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు నేను నిరాశతో వెలుతున్నానని, ఎప్పటికైనా నా ప్రియురాలిని కలుసుకుంటానని అలెగ్జాండర్ అంటున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Zhang contacted the channel a day after the report was aired to give her side, saying that she had thought it had all been a joke.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X