వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. బహిరంగ ప్రదేశాల్లోనూ వేధింపులు ... వెలుగులోకి ట్రంప్ లీలలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొందరు తమను ట్రంప్ లైంగికంగా వేధించారని తెలిపిన నేపథ్యంలో మరో కాలమిస్ట్ కూడా తాను బాధితురాలిననే చెప్పడం సంచలనం రేకెత్తించింది.

22 మందికి వేధింపులు
ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు .. 22 మంది మహిళలు తమను ట్రంప్ వేధించారని వాపోయారు. ట్రంప్ లీలలకు సంబంధించి జియన్ కరోల్ అనే కాలమిస్ట్ వేదనను న్యూయార్క్ మ్యాగజైన్ ప్రచురించింది. 1990లో ట్రంప్ వద్ద పనిచేసే సమయంలో తనను రేప్ చేశాడని పేర్కొంది. డిపార్ట్ మెంట్ స్టోర్, డ్రెస్సింగ్ రూంలో అఘాయిత్యానికి పాల్పడ్డారని వివరించింది. కరోల్‌తోపాటు 22 మంది మహిళలు ట్రంప్ నుంచి వేదింపులకు గురయ్యారు.

E. Jean Carroll joins at least 21 other women in publicly accusing Trump of sexual assault or misconduct

అప్పుడు తాను అనుభవించిన నరకాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నానని కరోల్ పేర్కొన్నారు. అంతేకాని ట్రంప్‌కు భయపడబోనని స్పష్టంచేశారు. ఆయన అనుచరులు తనను బెదిరిస్తారని, చంపుతారోనని వణకబోనని స్పష్టంచేశారు. తమను ట్రంప్ ముద్దుపెట్టారని, సున్నిత ప్రదేశాల్లో చేతులు పెట్టారని మహిళలు ఆరోపించారు. అయితే వారి ఆరోపణలను వైట్ హౌస్ కార్యాలయం తప్పుపట్టింది. ఇదంతా తప్పని .. కొందరు కావాలనే అధ్యక్షుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

బాధితులమే
అమెరికా అధ్యక్ష కార్యాలయం ప్రకటన ఇలా ఉంటే .. కరోల్ సహా తాను కూడా ట్రంప్ నుంచి వేధింపులకు గురయ్యానని పేర్కొన్నారు హిల్ హర్త్ అనే మేకప్ ఆర్టిస్ట్. ట్రంప్ బ్యూటీకి సంబంధించి ఒప్పందం చేసుకునే సమయంలో .. తనను వేధించాడని వాపోయారు. ముద్దుపెట్టి, చేతులు పెట్టి విచిత్రంగా ప్రవర్తించారని తెలిపింది. అంతేకాదు పడకగదికి కూడా వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ట్రంప్ మాజీ భార్య ఇవానా కూడా .. లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపారు.

వీరితోపాటు క్రిస్ట్రిన్ ఆండర్సన్, లిసా, టెంపుల్, మారిహ్ బిల్లాడో, క్యాథి హెల్లర్, కరెనా వర్జీనియా, బ్రిడ్జెట్ సువిల్లన్, తషా దిక్షన్, నటసా, రచెల్ క్రూక్స్, మిండి మెక్ గిల్ వ్రే, జెన్నిఫర్ మర్పీ, జెస్సికా డ్రెక్, నిన్ని, సమ్మర్, కాసండ్రా, అల్వా జాన్సన్, జూలియన్ హడ్డీ, జెస్సీకా లీడ్స్ అనే వనితలు ట్రంప్ చేతిలో లైంగికదాడికి గురయ్యారు.

English summary
On Friday afternoon, New York magazine published an excerpt from a memoir written by E. Jean Carroll in which the noted columnist describes being raped by Donald Trump in a department store dressing room in the 1990s. Carroll is at least the 22nd woman to step forward on the record with an account of an unwanted sexual advance or other encounter with Trump. Carroll explains in the excerpt that she didn’t come forward sooner out of fear that she’d be attacked, threatened, and smeared by Trump and his supporters. Trump has denied the accounts of all of the other women. A White House official told New York that the accusation is “completely false.” The accusations include rape, a threat of rape, unwanted groping, being kissed without consent, and being walked in on naked. Here are the accusations made by women who have come forward publicly under their own names.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X