భూమి అంతమయ్యే తేదీ చెప్పేసిన ఎలాన్ మస్క్.. ఆ గ్రహంపైకి వెళ్తున్నానంటూ సంచలన ప్రకటన

స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో దిగ్గజ వ్యాపార వేత్తగా ఎదిగారు ఎలాన్ మస్క్. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎలాన్ మస్క్ ఉన్నారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. త్వరలో భూగ్రహం అంతం కాబోతోందని.. మానవాళికి ఈ ఒక్క గ్రహం సరిపోదని అభిప్రాయపడ్డారు. సూర్యుడు విస్తరిస్తూ ఉన్నాడని అందువల్ల భూ గ్రహానికి పెను ముప్పు పొంచి ఉందని మస్క్ తెలిపారు.

ఈ మేరకు ఎలాన్ మస్క్.. అంగారక గ్రహంపై దృష్టి పెట్టారు. ఆ గ్రహం భవిష్యుత్తులో మానవాళి ఉండేందుకు అనువుగా ఉందని చెప్తూ వస్తున్నారు. 2026 నాటికి అంగారక గ్రహాన్ని భాగాలుగా విభజించి.. 2030 నాటికి మానవాళి అక్కడకు వెళ్లి నివాసం ఉండేందుకు పరిశోధనలు పూర్తవుతాయని అన్నారు. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'మార్స్ ను స్వాధీనం చేసుకోండి' అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ మార్పులతో పాటు వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం భూమి గ్రహం ఒక్కటే మానవాళికి సరిపోదు. సూర్యుడి విస్తరణ కారణంగా భూగ్రహానికి పెను ముప్పు రాబోతోంది. భూమికి ఏదైనా విపత్తు తలెత్తేలోపే ఇతర గ్రహాన్ని మానవుడు స్వాధీనం చేసుకోవడం ఉత్తమం. అంగారక గ్రహం మానవాళి నివాసానికి యోగ్యంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యుడు క్రమంగా విస్తరిస్తున్నాడని, 440 మిలియన్ సంవత్సరాలకు సూర్యుడి వేడికి భూమిపై జీవం లేకుండా పోతుందని ఆయన అంచనా వేశారు.

Earth s Final Days Elon Musk s Mission to Mars

2026 నాటికి అంగారక గ్రహంపై మానవ రహిత వ్యోమ నౌకను దించాలని.. ఆ తర్వాత 2030 లోపు మానవులను పంపాలని మస్క్.. చాలా సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల తన లక్ష్యాన్ని సవరించుకున్న ఆయన.. 2029 నాటికి మానవులు ఈ గ్రహంపై అడుగుపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు పరిశోధనలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. స్టార్‌ షిప్ వ్యోమ నౌకను అంగారక కక్ష్యలోకి పంపడం.. ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతలని మస్క్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+