భారీ భూకంపం-హడలిపోయిన జనం
Afghanistan earthquake 2025: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. ఇటీవలే మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించకముందే భూమి ప్రకంపించడం ఉలిక్కిపడేలా చేసింది.
సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజకిస్తాన్, కిర్గజిస్తాన్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీనివల్ల ప్రాణ, ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు. కొన్ని ప్రాంతాల్లో నివాసాలు బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సహా మూడు దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 4:43 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బఘ్లాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 121 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు యూరోపియన్ మిడ్‌టెర్రయిన సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
బఘ్లాన్ సిటీకి తూర్పు దిశగా 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు తెలిపింది. తజకిస్తాన్, కిర్గిజిస్తాన్‌లతో సరిహద్దులను పంచుకునే ప్రాంతం ఇది. ఫలితంగా ఆయా దేశాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి.
భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలా సేపటి వరకు రోడ్ల మీదే గడిపారు.
ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల పలు నివాసాలు బీటలు వారినట్లు వార్తలొస్తోన్నాయి. భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫైర్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. అయినప్పటికీ- ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది ఆఫ్ఘన్. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.
2023 అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1,500 మంది వరకు మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి అప్పట్లో.












Click it and Unblock the Notifications