పోర్ట్ సిటీలో భారీ భూకంపం

అమెరికా- ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధంతో అతలాకుతలమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ పశ్చిమ ప్రాంతాన్ని వణికించింది. మూడు రోజుల వ్యవధిలో భూమి ప్రకోపించడం ఇది రెండోసారి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు గానీ.. కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు తెలుస్తోంది.

తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.1గా రికార్డయింది. టెహ్రాన్ కు పశ్చిమ దిశగా 1,250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందర్ అబ్బాస్ రీజియన్ లో భూమి ప్రకంపించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. బందర్ అబ్బాస్.. పోర్ట్ సిటీ. ఇక్కడి నుంచి పశ్చిమ- మధ్య ప్రాంతం దిశలో 74 కిలోమీటర్ల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది. ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్ లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ పరిణామం సంభవించింది.

Earthquake today Magnitude 4 1 Rocks Iran 2nd in Three days as US-Israel Strikes Escalate Tensions

అంతకుముందు మంగళవారం నాడు ఇరాన్ దక్షిణాన గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. ఇరాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత భూకంప క్రియాశీలక దేశం ఇది. అరేబియా, యూరేషియన్ ప్లేట్ల ఘర్షణ వల్ల ఏర్పడిన జాగ్రోస్ ఫోల్డ్ థ్రస్ట్ బెల్ట్‌లో ఈ దేశం ఉంది. ఈ ప్రాంతంలో 4 నుండి 5 మాగ్నిట్యూడ్ భూకంపాలు సాధారణం.

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ భూకంపం పట్ల అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఇరాన్ తన అణు సామర్థ్యన్ని పరీక్షించి ఉండొచ్చని భావిస్తోన్నారు. దీని తీవ్రతకు భూమి కంపించి ఉండొచ్చని చెబుతున్నారు. భూగర్భ అణు పరీక్షలు జరిగితే రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతకు పైగా భూకంపాలని సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా భూకంప తీవ్రత 4.1 కే పరిమితమైందని గుర్తు చేస్తోన్నారు.

ఇరాన్ 24 గంటల్లో అణు బాంబు తయారు చేయగలనని పలుమార్లు ప్రకటించింది. యూరేనియం 60 శాతం వరకు శుద్ధి చేశామని తెలిపింది కూడా. అణు బాంబు తయారీకి 80 నుండి 90 శాతం యురేనియం శుద్ధి అవసరం. శాస్త్రీయ డేటా అణు సామర్థ్య పరీక్షలను ధృవీకరించట్లేదు. ఇది సహజంగానే సంభవించి ఉండొచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+