తీర ప్రాంతంలో భారీ భూకంపం..

Philippines earthquake 2025: భారత్‌ కు పొరుగునే ఉన్న ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. తీర ప్రాంత నగరంలో భూమి ప్రకంపించడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడ్డాయి. భూకంప తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరాన్ని ఖాళీ చేయించారు.

రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 4:37 నిమిషాలకు భూమి ప్రకంపించింది. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని తీర నగరం మిండనావోను భూకంప కేంద్రంగా గుర్తించారు. దవావో ఆక్సిడెంటల్ ప్రావిన్స్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం.

Earthquake today Magnitude 6 0 hit the southern Philippines

5.28 ఉత్తర అక్షాంశం, 126.08 తూర్పు రేఖాంశం వద్ద ఉపరితలం నుంచి 105 కిలోమీటర్ల దిగువన టెక్టోనిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

దీని ప్రభావం ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంపై పడింది. తీరం అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. భూకంప తీవ్రత 6.0 కావడం వల్ల తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ వార్తలొచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

భూకంపం వల్ల ఎంత మేర ప్రాణనష్టం సంభవించిందనేది ఇంకా తెలియరావట్లేదు. కొన్ని చోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. మిండనావో, దవావో ఆక్సిడెంటల్ ప్రావిన్స్ లో కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు సమాచారం అందింది. వారం రోజుల్లో ఫిలిప్పీన్స్ లో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి.

ఇటీవలే ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. నిజానికి రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఇదీ ఒకటి కావడం వల్ల ఫిలిప్పీన్స్ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. దీని తీవ్రత అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+