చైనాను కుదిపిన భూకంపం
China earthquake: చైనాలో భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. సరిగ్గా మూడు రోజుల తేడాతో ఒకే ప్రాంతంలో భూమి ప్రకంపించడం ఇది రెండోసారి కావడం, దాని తీవ్రత కూడా దాదాపుగా ఒకేరకంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా రికార్డయింది. ఆదివారం రాత్రి సరిగ్గా 11 గంటల సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలో ఉన్న నగ్కు ప్రీ-ఫెక్షర్ లో భూమి ప్రకోపించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్ లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది.

ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. స్వల్పంగా ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నెల 16వ తేదీన చైనాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.6గా నమోదైంది.
25.05 నార్త్ అక్షాంశం, 99.72 ఈస్ట్ రేఖాంశం పరిధిలోకి వచ్చే యునాన్ ప్రావిన్స్ పశ్చిమ ప్రాంతంలోని బావోషాన్, కున్మింగ్, అటానమస్ ప్రీ-ఫెక్చర్ లో భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ప్రాంతం మయన్మార్ సరిహద్దులకు ఆనుకుని ఉండటం వల్ల ప్రకంపనలు ఆ దేశంలో కూడా కనిపించాయి.
మూడు రోజుల వ్యవధిలో దాదాపుగా ఒకేరకమైన తీవ్రతతో భూమి ప్రకంపించడం చర్చనీయాంశమైంది. దీనిపై చైనా భూగర్భ శాస్త్రవేత్తలు ద్రుష్టి సారించారు. అది కూడా ఒకే ప్రీ- ఫెక్చర్ లో ప్రకంపనలు రావడం అనేది చైనా భౌగోళికపరంగా అరుదుగా సంభవిస్తుంటుందని చెబుతున్నారు.
కాగా- ఈ నెల 5వ తేదీన ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్, 12వ తేదీన సెంట్రల్ పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీనివల్ల ప్రాణ నష్టం సంభవించలేదు. ఆస్తినష్టం స్వల్పంగా కనిపించింది. 15వ తేదీన టర్కీలోనూ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1 గా రికార్డు అయింది. ఆ మరుసటి రోజే అంటే 16న, మళ్లీ ఇప్పుడు చైనాలో ఈ విపత్తు చోటు చేసుకోవడం అరుదుగా భావిస్తోన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications