వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాక్లెట్లు తింటే గుండె జబ్బులు దూరం: అధ్యయనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చాక్టెట్లు రోజూ తింటే కొవ్వు కరుగుతుందని, పళ్లు పాడైపోతాయని డాక్టర్లు చెబుతుండగా మనం చూశాం. కానీ, రోజుకు వంద గ్రాముల మిల్క్ చాక్లెట్ లేదా డార్క్ చాక్లెట్ తింటే గుండె జబ్బులు, పక్షవాతం దరిచేరదని పరిశోధకులు చెబుతున్నారు.

రోజూ చాక్లెట్ తినేవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం 11 శాతం తక్కువని, గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం కూడా 23 శాతం తగ్గుతుందని స్కాట్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్‌కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

Eating chocolate linked to 'lower heart disease and stroke risk'

చాక్లెట్లకు, గుండె జబ్బులకు మధ్య ఉన్న సంబంధాన్ని వెలికితీసేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. సుమారు 20 వేల మందిని 12 సంవత్సరాల పాటు పరిశీలించి, ఈ ఫలితాలను వెల్లడించారు. రోజుకు వంద గ్రాముల వరకు డార్క్, మిల్క్ చాక్లెట్లు తింటున్న వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గినట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు.

చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివి కావనే నమ్మకానికి విరుద్ధంగా తమ ఫలితాలు వచ్చాయని వర్సిటీ పరిశోధకులు తెలిపారు. చాక్లెట్‌కు మరియు గుండె జబ్బుల లింకులపై గతంలో వెల్లడించిన వాటిపై కూడా అబెర్డీన్ పరిశోధకులు సమీక్ష నిర్వహించారు.

English summary
University of Aberdeen experts looked at the eating habits of more than 20,000 middle-aged and elderly people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X