భారత్ ఒక్కరోజులోనే! అమెరికా మాత్రం..: ఎలాన్ మస్క్ స్పెషల్ ట్వీట్
భారత ఎన్నికల ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk). అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలింగ్ జరిగి వారాలు గడుస్తున్నా ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా భారత్‌తో పోల్చితే అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎంతో ఆలస్యమని పేర్కొన్నారు.
భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు? అనే హెడ్‌లైన్‌తో ప్రచురితమైన ఓ వార్త కథనాన్ని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనికి 'భారత్ ఒక్కరోజులోనే 640 మిలియన్ ఓట్లను లెక్కించింది కానీ, కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉంది' అంటూ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

కాగా, నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు కూడా ప్రకటించారు. అయినప్పటికీ.. కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడం గమనార్హం. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియానే.
India counted 640 million votes in 1 day.
— Elon Musk (@elonmusk) November 24, 2024
California is still counting votes 🤦♂️ https://t.co/ai8JmWxas6
ఇక, కాలిఫోర్నియాలో మెయిల్ ద్వారా పోలైన ఓట్లు ఎక్కువగా ఉండటంతో వాటిని లెక్కించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పటికే 98 శాతం కౌంటింగ్ పూర్తయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 54 ఎలక్టోరల్ ఓట్లను డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఆ ప్రాంతంలో నుంచి సాధించారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరిలో బాధ్యతలు తీసుకోనున్నారు. 2025, జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కానున్నారు.












Click it and Unblock the Notifications