వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలెరిగి వాత పెడుతున్న ఉద్యోగులు..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌.. అల్లకల్లోలానికి గురవుతోంది. అతలాకుతలమౌతోంది. ఇన్ని సంవత్సరాల పాటు సజావుగా సాగుతూ వచ్చిన ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కుదుపులకు లోనవుతోంది. రోజూ పెను సంచలనాలు నమోదవుతున్నాయి ఇందులో. ఒక దాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.

ఉద్యోగుల తొలగింపుతో..

ఉద్యోగుల తొలగింపుతో..

ట్విట్టర్‌లో పని చేసే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు ఎలాన్ మస్క్. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ పట్టించుకోవట్లేదు. ఉద్యోగాల్లో కోత పెట్టారు. కొత్త ఉద్యోగాల నియామకాలను నిలిపివేశారు. టెక్నికల్, సేల్స్, ప్రొడక్ట్స్, అడ్వర్టయిజ్‌మెంట్, లీగల్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కుదించాలంటూ ఆయా విభాగాల మేనేజర్లందరికీ మెయిల్ పంపించారు. ఈ నెల 1వ తేదీ నుంచే ఉద్యోగులను తొలగించేలా ఎలాన్ మస్క్ చర్యలు తీసుకున్నారు.

సగం ఉద్యోగులపై వేటు..

సగం ఉద్యోగులపై వేటు..


ట్విట్టర్‌ అధినేతగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ ఉద్యోగుల తొలగింపుపైనే తన పూర్తి దృష్టిని కేంద్రీకరించారు ఎలాన్ మస్క్. దీన్ని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రారంభం నుంచీ ట్విట్టర్‌లో పని చేస్తోన్న వేలాదిమంది ఉద్యోగులు బయటికెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు మూడువేల మందికి పైగా ఉద్యోగులను తొలగించారాయన. అక్కడి పని వాతావరణం, ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా పెట్టి వెళ్లినపోయిన వారూ చాలామందే ఉన్నారు.

టాప్ ఎగ్జిక్యూటివ్స్‌తో మొదలు..

టాప్ ఎగ్జిక్యూటివ్స్‌తో మొదలు..

ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ కూడా దీనికి మినహాయింపు కాదు. లీగల్, పాలసీ చీఫ్ విజయ గద్దె కూడా తప్పుకోనున్నారు. ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్గెట్ సైతం కంపెనీని వీడనున్నారు. 2012 నుంచీ సీన్ ఎడ్గెట్.. ట్విట్టర్‌లో కొనసాగారు. ఎలాన్ మస్క్ వ్యవహార శైలి నచ్చకపోవడం పలువురు సెలెబ్రిటీస్ కూడా తమ ట్విట్టర్ అకౌంట్స్‌ను డిలెట్ చేసుకున్నారు. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ జనరల్ మోటార్స్..ట్విట్టర్‌కు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను నిలిపివేసింది.

అప్పటికీ మారని మస్క్..

అప్పటికీ మారని మస్క్..

ట్విట్టర్‌లో ఇంతా జరుగుతున్న ఎలాన్ మస్క్ వైఖరి మాత్రం ఏ మాత్రం మారలేదు. ఉద్యోగులకు డెడ్ లైన్ పెట్టారు. ట్విట్టర్ 2.0 మిషన్‌లో భాగంగా అత్యంత కఠినమైన వాతావరణంలో పని చేయాల్సి ఉంటుందంటూ ఉద్యోగులకు సూచించారాయన. అలా చేయలేని వారు ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాలంటూ హెచ్చరించారు. ఇక మున్ముందు సంస్థలో మరిన్ని కఠిన నిర్ణయాలు, పని వేళలు ఉంటాయని స్పష్టం చేశారు.

సామూహిక రాజీనామాలు..

సామూహిక రాజీనామాలు..

ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ట్విట్టర్ ఉద్యోగులందరూ మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. సామూహికంగా రాజీనామా చేస్తోన్నారు. దీనికి సంబంధించిన సమాచారంతో ట్విట్టర్‌ పోటెత్తింది. తాను 12 సంవత్సరాలుగా ఇందులో పని చేస్తోన్నానని, ఏనాడు కూడా అభద్రత భావానికి లోను కాలేదంటూ భారత సంతతికి చెందిన ట్విట్టర్ ఉద్యోగి సతన్‌జీవ్ బెనర్జీ తెలిపారు. ట్విట్టర్ నాశనమౌతోండటాన్ని తాను చూడలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.

ఆఫీసులు మూత..

ఆఫీసులు మూత..

ట్విట్టర్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామంతో పలు దేశాల్లో ట్విట్టర్ కార్యాలాయాలు మూత పడుతున్నాయి. ఉద్యోగులెవరూ కూడా ఆఫీసులకు వెళ్లట్లేదు. ఈ విషయాన్ని మేనేజింగ్ ఎడిటర్ జోయ్ షిఫర్ ధృవీకరించారు. అన్ని కార్యాలయ భవనాలు తాత్కాలికంగా మూత పడ్డాయని, బ్యాడ్జ్ యాక్సెస్‌ను నిలిపివేశామని అన్నారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను నాశనం చేస్తోన్నారనే భయం ఉద్యోగుల్లో ఏర్పడిందనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. నవంబర్ 21వ తేదీన కార్యాలయాలను తిరిగి తెరుస్తామని అన్నారు.

English summary
Hundreds of employees have resigned ahead of the deadline given to them by Elon Musk to either agree to his extremely hardcore way of work or quit the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X