వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మళ్లీ ఎన్నికలు?: ట్రంప్ శిబిరం ట్వీట్‌తో కలకలం -అధికార మార్పిడి మళ్లీ అయనకేనట

|
Google Oneindia TeluguNews

''అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనడానికి మాకు ఆధారాలు దొరికాయి. ఇంక మోసగాళ్ల పని పడతాం'' అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నడిపి కొడుకు ఎరిక్ ట్రంప్ చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. అంతకు ముందు కూడా ఆయన డిలిట్ చేసిన మరో ట్వీట్ అగ్రరాజ్యంలో చిన్నపాటి గత్తర లేపింది. మరో వైపు ట్రంప్ బాటలోనే ఆయన మంత్రులు సైతం సీట్లు వీడేందుకు నిరాకరిస్తున్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

 ట్రంప్‌కు ఊరట అలస్కాలో విజయం -ఫలితాలపై పోరు ముమ్మరం -ఎవరూ అడ్డుకోలేరని బైడెన్ గరం ట్రంప్‌కు ఊరట అలస్కాలో విజయం -ఫలితాలపై పోరు ముమ్మరం -ఎవరూ అడ్డుకోలేరని బైడెన్ గరం

ఎరిక్ ట్రంప్ ట్వీట్ దుమారం..

ఎరిక్ ట్రంప్ ట్వీట్ దుమారం..

అమెరికాలో ఎలక్షన్ డే(నవంబర్ 3) వెళ్లిపోయి వారం రోజులైంది. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ డెమోక్రాట్ బైడెన్ 290 ఓట్లతో కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా అలస్కాను కూడా తన ఖాతాలోకి వేసుకోవడంతో 2017 ఓట్లకు చేరారు. 12 రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కనసాగుతుండటంతో తుది ఫలితాల వెల్లడికి మరింత సమయం పడుతుంది. అయితే, బైడెన్ గెలుపును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమంటోన్న ట్రంప్ శిబిరం.. న్యాయ పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికల అక్రమాలపై ఆధారాలు కూడా లభించాయని చెబుతోంది. ఈ గందరగోళంలోనే ట్రంప్ శిబిరంలోని కీలక వ్యక్తి, నడిపి కొడుకైనఎరిక్ మొన్న మంగళవారం చేసిన ట్వీట్ పై నెట్టింట దుమారం కొనసాగుతున్నది. నవంబర్ 10న ఎరిక్ తన అధికారిక ఖాతా నుంచి ‘‘మిన్సెసోటా ప్రజలంతా మేల్కొని బయటికొచ్చి ఓటేయండి..''అని పిలుపునిచ్చారు. కొద్ది నిమిషాల్లోనే ఎరిక్ ఆ ట్వీట్ ను డిలిట్ చేసేసినా, అప్పటికే జరగాల్సింది జరిగిపోయిందిలా..

కమల భర్త ఎమోషనల్ పోస్ట్ -50ఏళ్ల వయసులో పెళ్లి -బ్రాహ్మణ-యూదు కాంబో -అభాండాలుకమల భర్త ఎమోషనల్ పోస్ట్ -50ఏళ్ల వయసులో పెళ్లి -బ్రాహ్మణ-యూదు కాంబో -అభాండాలు

మళ్లీ ఎన్నికలా?

మళ్లీ ఎన్నికలా?

పోలింగ్ పూర్తయిన వారం తర్వాత ఓటేయడానికి రమ్మంటూ పిలుపునిచ్చిన ఎరిక్ ట్రంప్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ‘‘ఏం బాబూ.. అమెరికాలో మళ్లీ ఎన్నికలు పెడుతున్నారా?'' అని ఒకరు, ‘‘నిజంగా నువ్ ట్రంప్ కొడుకువే.. ఈ ఏడాదిలోనే గొప్ప విషయాన్ని కనిపెట్టావ్''అని ఇంకొకరు, ‘‘అరే చీటింగ్ పై పోరాడుతామని చెబుతున్నవాళ్లే ఓట్ ఫ్రాడింగ్ కు పాల్పడాలని పిలుపిస్తున్నారే''అని మరొకరు ట్రోల్ చేశారు. భారత సంతతి సెలబ్రిటీ పద్మా లక్ష్మీ మరో అడుగు ముందుకేసి.. ‘‘ఇక చాలించి, దిగిపోండి.. ఎరిక్ ట్రంపేమో జనాన్ని ఓటేయమంటాడు.. మైక్ పేన్స్ ఫ్లోరిడాలో ఎండలో నిలబడ్డాడు.. రూడీనేమో డిల్డో దుకాణంలో తచ్చాడుతున్నాడు..''అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే..

Recommended Video

US Election 2020 Results: Trump Wins Alaska, Joe Biden On Donald Trump
త్వరలోనే ట్రంప్ 2వ టర్మ్..

త్వరలోనే ట్రంప్ 2వ టర్మ్..


ఎన్నికల్లో నేనే గెలిచానంటోన్న ప్రెసిడెంట్ ట్రంప్ బాటలోనే ఆయన ఫెడరల్ కేబినెట్ మంత్రులూ పయనిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పేన్స్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రెండో దఫా అధికారం చేపట్టబోతున్న ట్రంప్ పాలనా యంత్రాంగానికి అధికార మార్పిడి సజావుగా సాగుతుందని, అందుకోసం తామంతా సిద్ధంగా ఉన్నామని జనవరి 20 తర్వాత ట్రంప్ 2వ టర్మ్ పాలన ప్రారంభమవుతుందని ఉద్ఘాటించారు. అమెరికా గందరగోళం నెలకొన్న వేళ... పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం ఆయా దేశాలతో చర్చించేందుకు పాంపియో ఏడు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. శుక్రవారం నుంచి ఆయన పర్యటన ప్రారంభంకానుంది.

English summary
Donald Trump’s son Eric Trump urges people to vote a week after US elections, trolled on Twitter. US Secretary of State Mike Pompeo asserted that there will be a smooth transition to a second Trump Administration, indicating that he believes Donald Trump has won the November 3 presidential elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X