వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కార్చిచ్చు: 5 లక్షల మంది ఖాళీ, పదుల సంఖ్యలో మృతి..

|
Google Oneindia TeluguNews

అమెరికా సంయుక్త రాష్ట్రాలపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది. పశ్చిమ తీర రాష్ట్రాల్లో రేగిన దావాగ్నితో గత నెలలో 24 మంది చనిపోయారు. అగ్ని ఇళ్లకు వ్యాపించడంతో వేలాదిమంది కట్టుబట్టలతో వెళ్లిపోయారు. దాదాపు 5 లక్షల మంది వరకు తమ నివాసాలను వదిలి వెళ్లిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అమెరికాలో 100 వరకు ప్రమాదాలు జరిగాయి. న్యూజెర్సీలో మంటల ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే కాలిఫొర్నియో, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. మంటలతో వస్తోన్న పొగ వల్ల గాలి కలుషిత అవుతోంది. ఒరెగాన్‌లో తీవ్ర ప్రభావిత ప్రాంతాలపై అధికారులు గాలింపు చర్యలను శుక్రవారం చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున.. సహాయక చర్యలను చేపడుతున్నట్టు వివరించారు.

Everything Is Gone: Hundreds Of Homes Torched In US Wildfires..

మొలల్లాలో 9 వేల మంది ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు కోరారు. అయితే 30 మంది మాత్రం వెళ్లేందుకు నిరాకరించారని అధికారులు తెలిపారు. ఒరెగాన్‌లో 40 వేల మంది తప్పకుండా ఖాళీ చేయాలని.. మరో 50 వేల మంది రెడ్ జోన్‌లో ఉన్నారని గవర్నర్ కేట్ బ్రౌన్ తెలిపారు. యెల్లో జోన్ వారు తమ నివాసాలను వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని.. గ్రీన్ జోన్ వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఒరెగాన్‌ అడవీలో మంటలు చెలరేగిన పట్టణంలోకి గాలులు వ్యాపించాయి. దీంతో గాలిలో పొగ కమ్ముకొని ఉంది. దీంతో తేమ తగ్గుతోందని.. వర్షం కూడా తక్కువగా కురుస్తోందని నిపుణులు తెలిపారు. ఇక్కడ తమకు వాతావరణం అనుకూలంగా ఉంది అని.. గాలుల ప్రభావం లేదు అని ఒరెగాన్ అటవీశాఖ అగ్నిమాపక అధికారి డగ్ గ్రాఫ్ అన్నారు.

English summary
half a million people in americas Oregon were under evacuation alerts on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X