పగబట్టిన ట్రంప్.. భారత్ కు షాక్ మీద షాక్ లు.. శత్రు దేశాలతో కలిసి బిగ్ స్కెచ్..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ పై ట్రంప్ పగబట్టినట్లు కనిపిస్తోంది. ఇందుకు గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరే సాక్ష్యం. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారత్ లాంటి దేశాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రపంచ దేశాల ముందు భారత్ ను కావాలనే తక్కువ చేసి మాట్లాడటం.. పాకిస్థాన్ లాంటి ఉగ్ర దేశంతో పోల్చడం ఇటు భారతీయులకు అటు ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు.

పహల్గాం ఉగ్రదాడితో ఉలిక్కి పడ్డ భారత్ కు ప్రపంచ దేశాలు సానుభూతి తెలిపాయి. ఉగ్రవాదాన్ని అణచివేయాలని పిలుపునిచ్చాయి. పాకిస్థాన్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. కానీ పెద్దన్నగా చెప్పుకునే ట్రంప్ మాత్రం ఆశించినంత స్థాయిలో స్పందించలేదు. కానీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచే భారత్- పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని శ్వేతసౌథం నుంచి ప్రకటనలు వెలువడటం గమనార్హం.

అంతేకాక భారత్- పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపేశానని.. యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని చెప్పుకొచ్చారు ట్రంప్. గల్ఫ్ దేశాల్లో ఇటీవల పర్యటించిన ట్రంప్ అక్కడ కూడా ఇదే పాట పాడారు. అంతేకాక ప్రపంచ దేశాల ముందు భారత్ ను తక్కువ చేసి మాట్లాడారు. తనకు భారత్- పాకిస్థాన్ రెండూ మిత్ర దేశాలనీ..ఇరు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో పాకిస్థాన్ లాంటి ఉగ్రదేశంతో భారత్ ను పోల్చడం ఏంటని యావత్ భారతావని నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు పాకిస్థాన్కు యుద్ధంలో టర్కీ సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. టర్కీ నుంచి భారీగా డ్రోన్లు, ఇతర ఆయుధాలను పాకిస్థాన్ సరఫరా చేసకుంది. ఇప్పుడు ట్రంప్ ఆ దేశానికి సాయం చేస్తున్నారు. 225 మిలియన్ డాలర్ల విలువైన AMRAAM మిస్సైల్స్ ను టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. అంతేకాక 79.1 మిలియన్ డాలర్ల 60 బ్లాక్- 2 క్షిపణులను కూడా టర్కీకి అందించనుంది అమెరికా. ఇదే క్రమంలో పాకిస్థాన్ కు అన్నివైపులా టర్కీ అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ వైఖరిపై భారత్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సౌదీ అరేబియా పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కడ నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో ట్రంప్ వివాదాస్పదంగా మాట్లాడారు. భారత ఆర్థిక, వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు. భారత్ లో యాపిల్ సంస్థ పెట్టుబడులు పెట్టడం, యాపిల్ ఫోన్లను తయారు చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

ఇది మరువక ముందే భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను అక్కడి అధికారులు.. సరైన పత్రాలు లేవనే కారణంగా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు ఉంటుందని సమాచారం. ఇది భారతీయ కరెన్సీలో 4 కోట్లుగా ఉంది. దీంతో వీటిని తిరిగి భారత్ కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్దితి రైతులకు ఎదురైంది. ఇలా భారత్ కు ట్రంప్ షాక్ మీద షాక్ లు ఇస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా, చైనా దేశాలు ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నాయి. రష్యా, భారత్, జపాన్ లాంటి దేశాలు తరువాతి స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. చైనాను ఎలాగో అధిగమించలేమని చేతులెత్తేసిన ట్రంప్.. ఇక భారత్ పై పగ బట్టినట్లు తెలుస్తోంది. భారత్ ను సూపర్ పవర్ కాకుండా అడ్డుకుంటే తమ దేశ పరువు నిలుస్తుందని ట్రంప్ భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Everywhere Along the Way Trump s India Strategy Faces Growing Scrutiny

అలాగే భారత్ ప్రస్తుతం తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా ఎదుగుతోంది. అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు. దీంతో ట్రంప్ భారత్ పై కక్ష కట్టినట్లు తెలుస్తోంది. అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లే తోక ఆడించాల్సిన పరిస్థితిలో భారత్ లేదు. ఈ కారణంగానే భారత్ పై ట్రంప్ పగబట్టినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+