బాలల అశ్లీల చిత్రాలు..: మైక్రోసాఫ్ట్‌పై మాజీ ఉద్యోగుల దావా

మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఇద్దరు మాజీ ఉద్యోగులు హెన్రీ సోటో, గ్రెగ్ బ్లాయెర్ట్ దావా వేశారు.

శాన్‌ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఇద్దరు మాజీ ఉద్యోగులు హెన్రీ సోటో, గ్రెగ్ బ్లాయెర్ట్ దావా వేశారు. బాలల అశ్లీల చిత్రాలు, హింసాత్మక సంఘటనలు, హత్యలతో కూడిన వీడియోలను ఆన్‌లైన్‌లో నివారించేందుకు తాము పీటీఎస్‌డీని అభివృద్ధి చేసినట్లు వారు పేర్కొన్నారు. తామిద్దరమూ మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ రక్షణ బృందంలో పని చేసినట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన కంటెంట్‌ను తొలగించాలా? పోలీసులకు ఫిర్యాదు చేయాలా? అనే అంశాన్ని నిర్ధారించే విధులను తాము నిర్వహించినట్లు చెప్పారు. తమ విధుల్లో భాగంగా అశ్లీల, హింసాత్మక, అసభ్యకర వీడియోలను చూసేవారమన్నారు. ఇంత దారుణమైన వీడియోలను నిరంతరం చూడటం వల్ల తమ మానసిక స్థితి అత్యంత తీవ్రంగా దెబ్బతిందని గత నెలలో దాఖలు చేసిన ఈ దావాలో కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

Ex-Microsoft staff suing ‘for PTSD’ over graphic child sex imagery

ఈ ఉద్యోగాలనుంచి ఆశించదగినది ఏమిటో మైక్రోసాఫ్ట్ తమకు చెప్పలేదని పిటిషనర్లు ఆరోపించారు. తమను బలవంతంగా ఈ సెక్షన్‌కు బదిలీ చేసి, 18 నెలల పాటు పని చేయించారని తెలిపారు. ప్రస్తుతం తమకు పీడకలలు వస్తున్నాయని, మానసికంగా తీవ్రంగా దెబ్బ తిన్నామని తెలిపారు. తమకు చికిత్స చేయించడానికి కూడా ఆ కంపెనీ తిరస్కరిస్తోందని వాపోయారు.

కాగా, ఈ ఆరోపణలపై స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి సంక్లిష్టమైన విధులను నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి, భద్రతకు మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపింది. చట్టవిరుద్ధమైన బొమ్మలు, వీడియోలు, బాలల అశ్లీల చిత్రాలు, తదితర దారుణాలను తనిఖీ చేసే ఉద్యోగులకు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+