'భారత్ తో పెట్టుకోవద్దు'.. పాక్ కు ఆ దేశ మాజీ లెఫ్టినెంట్ జనరల్ సూచన
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడిలో వందలాది మంది ఉగ్రమూకలు హతం అయినట్లు భారత రక్షణశాఖ స్పష్టం చేసింది. అలాగే భారత క్షిపణుల ధాటికి పాక్ లోని ఎయిర్ బేస్ లు కూడా ధ్వంసం అయ్యాయి. దాంతోపాటు పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం రద్దు, ఇరు దేశాల గగనతలం మూసివేత.. తదితర చర్యలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఎన్ఎస్ఏ అధికారి నజీర్ జంజువా భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ మాజీ ఎన్ఎస్ఏ అధికారి, ల్యుటినెంట్ జనరల్ నజీర్ జంజువా భారత్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై భారత్ మరోసారి దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాక్ పై భారత్ నుంచి మరో మిసైల్ దాడి జరగొచ్చని నజీర్ అభిప్రాయపడ్డారు. మనం చాలా జాగ్రత్తగా, సమాయత్తంతో ఉండాలి అని పాకిస్థాన్ లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ మిసైల్ టెక్నాలజీలో గణనీయంగా అభివృద్ధి సాధించిందన్న విషయం భారత్ కు అర్ధమైంది. పాకిస్థాన్, పాకిస్థాన్ మిలిటరీ.. భారత్ ను ఒంటరి చేయగలదని ప్రపంచ దేశాలకు అర్థమవుతోందని నజీర్ జంజువా కీలక వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ 6 న డైలాగ్ పాకిస్థాన్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్- పాకిస్థాన్ ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. యుద్ధరంగంలో భారత్ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన సంఘటనల మాదిరిగానే పాకిస్థాన్ పై భారత్ మరోసారి దాడులు చేయవచ్చని తెలిపారు. చర్చలు, ఇరు దేశాల సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కు తీసుకురావడంతోనే శాంతి నెలకొంటుందని నజీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే భారత్ నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ రెడీగా ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications