Non Veg Milk ను భారత్ కు అంటగట్టడానికి ట్రై చేస్తోన్న ట్రంప్
India US Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త టారిఫ్‌లు దేశ వాణిజ్యం రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రత్యేకించి కాపర్, ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై ఈ టారిఫ్ భారత్ కు పెను సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉక్కు, అల్యూమినియంపై విధించిన టారిఫ్ తర్వాత ఇప్పుడు కాపర్ పై 50 శాతం టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్ల విలువైన కాపర్, దాని ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసింది భారత్. ఇది రికార్డు.

ఈ ఎగుమతుల్లో అమెరికా వాటా 360 మిలియన్ డాలర్ల పైమాటే. అంటే మొత్తం రాగి ఎగుమతుల్లో ఇది 17 శాతం. అమెరికా భారత్ కు మూడవ అతిపెద్ద కాపర్ ఎగుమతి మార్కెట్. కాపర్ ఎగుమతుల్లో సౌదీ అరేబియా- 26, చైనా- 18 శాతం అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ రంగాల్లో కాపర్ వినియోగం విస్తృతంగా ఉంటోంది. అమెరికాలో డిమాండ్ తగ్గినా కూడా దేశీయ కాపర్ పరిశ్రమపై ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, ఈ టారిఫ్ గండం నుంచి భారత్ తేలిగ్గానే బయటపడగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో నాన్ వెజ్ మిల్క్ అంశం తెర మీదికి వచ్చింది. దీన్ని భారత్ కు పెద్ద ఎత్తున ఎగుమతి చేయాలని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నాలు చేపట్టింది. భారత్ తో జరుపుతున్న ట్రేడ్ డీల్ చర్చల్లో దీన్ని ప్రధాన అజెండాగా చేర్చింది. నాన్ వెజ్ మిల్క్ ఎగుమతులను భారత్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. దీన్ని తమ దేశంలో దిగుమతి చేసుకోవడానికి అంగీకరించట్లేదు.
దీంతో భారత్- అమెరికా ట్రేడ్ డీల్ చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ట్రేడ్ డీల్ ను ఖరారు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ఆగస్టు 1. ఒకవంక గడువు సమీపిస్తోన్నప్పటికీ వ్యవసాయం, పాడి పరిశ్రమల విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. చర్చలు కొలిక్కి రావట్లేదు.
ప్రధానంగా నాన్-వెజ్ మిల్క్ పై ఆందోళనలు వ్యక్తం చేస్తోంది భారత్. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే నాన్ వెజ్ మిల్క్, దాని ఆధారిత ఉత్పత్తుల వల్ల దేశీయ పాడిపరిశ్రమ తీవ్రంగా ప్రభావితమౌతుందని భావిస్తోంది. 140 కోట్ల మందికి పైగా ప్రజల నిత్యావసరాల్లో ఒకటైన పాల విషయంలో రాజీ పడకూడదని తీర్మానించుకుంది.
సియాటెల్ పోస్ట్ ప్రకారం.. మాంసం లేదా రక్తం వంటి జంతు ఆధారిత ఉత్పత్తులను ఆహారంగా తీసుకునే ఆవులు ఇచ్చే పాలను నాన్-వెజ్ మిల్క్ గా పిలుస్తారు. అమెరికాలో పశువులకు ఇచ్చే దాణాలో జంతు సంబంధిత దాణా ఉంటుంది. ఆవులు, పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు లేదా కుక్కల శరీర భాగాల మిశ్రమాలతో కూడిన దాణాను ఆవులకు ఆహారంగా ఇస్తారక్కడ. పంది, గుర్రపు రక్తం, కరిగించిన కొవ్వును కూడా దాణాగా వేస్తుంటారు.
నాన్-వెజ్ పాలతో సమస్య ఏమిటి?
భారత్ లో పరిస్థితులు దీనికి పూర్తి భిన్నం. దేశంలో ఆవులకు పూర్తిగా శాకాహారాన్నే అందిస్తుంటాం. పాలను పవిత్రంగా భావిస్తుంటాం. పూజాదికాల్లో పాలు ఓ భాగం. శాకాహారంగా దీన్ని తీసుకుంటుంటాం. పెరుగు, నెయ్యి, ఇతర పాల ఆధారిత పదార్థాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది మనదేశంలో.
ఫలితంగా- నాన్ వెజ్ మిల్క్ విషయంలో భారత్ పట్టువదలట్లేదు. రాజీ పడట్లేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పాలు.. నాన్ వెజ్ మిల్క్ కాదని, జంతు వ్యర్థాలను ఆహారంగా తీసుకోని ఆవుల నుండి మాత్రమే సేకరించినట్లుగా ధృవీకరించాలని పట్టుబట్టింది. ఫలితంగా- ట్రేడ్ డీల్ చర్చలు కొలిక్కి రావట్లేదు.
అమెరికా వాదన ఏంటీ?
భారత్ చేస్తున్న డిమాండ్లను అమెరికా వాణిజ్య అవరోధాలుగా భావిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లోనూ లేవనెత్తింది కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు, వినియోగదారుగా ఉన్న భారత మార్కెట్‌ను అమెరికా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం- అమెరికా పాడి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారత్ గనక అనుమతి ఇస్తే దేశానికి సంవత్సరానికి రూ. 1.03 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దేశ పాడి పరిశ్రమ జాతీయ స్థూల విలువకు దాదాపు 2.5 నుంచి 3 శాతం అంటే రూ. 7.5-రూ. 9 లక్షల కోట్లకు దోహదం చేస్తుందని లైవ్ మింట్ పేర్కొంది.
-
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!












Click it and Unblock the Notifications