పాక్ - చైనా తీరు పై భారత్ ఆగ్రహం : ఐరాస వేదికగా నిలదీత ...!!
పాకిస్థాన్ - చైనా దేశాలకు భారత్ షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి వేదికగా భారత్ చురుకలు అంటించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ - చైనా తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు దేశాలకు చెప్పదలచుకున్నది స్పష్టం చేసారు. తీవ్రదాదులను బ్లాక్ లిస్టులో చేర్చాలనే ప్రతిపాదనకు చైనా వీటో అధికారంతో అడ్డుపడటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు.
ఐక్యారాజ్య సమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్- చైనాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఉగ్రవాదులను రక్షించటం కోసం తటస్థ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ శాంతి - భద్రత నిర్వహణ పైన జరిగిన చర్చకు భారత్ తరపున మంత్రి జైశంకర్ అధ్యక్షత వహించారు. పాక్ ప్రోత్సహిస్తున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చాలనే ప్రతిపాదనకు చైనా వీటో అధికారంతో పదే పదే అడ్డుపడటం పైన జైశంకర్ చురకలు అంటించారు. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని పదేపదే ప్రస్తావించటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

లాడెన్ ను అతిథ్యం ఇవ్వటంతో పాటుగా, పొరుగు దేశ పార్లమెంట్ పై దాడి జరిగితే సంబరాలు చేసుకోసుకుంటారా అంటూ నిలదీసారు.ఉగ్రవాద నిర్మూలనకు పలు దేశాలు భాద్యతతో సమిష్ఠి తత్వంతో ముందుకు వస్తున్నా.. కొందరు నేరస్థులను సమర్ధించేలా వారిని రక్షించటానికి ఇలాంటి తటస్థ వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని జైశంకర్ మండిపడ్డారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా వంటి దేశఆలు విశ్వసనీయమైన పాత్రను భద్రతా మండలిలో కొనసాగించాలని సూచించారు. వారు భాగస్వామ్యం పంచుకోకుంటే భవిష్యత్ సంబంధించిన అంశాలపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేమని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications