వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ ఇండియా ఎండిగా కీర్తిగా రెడ్డి రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ‌: ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా కీర్తిగా రెడ్డి రాజీనామా చేశారు. ఆమె అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయంలో పనిచేసే అవకాశాలున్నాయి. ఆమె వారసుడి కోసం ఫేస్‌బుక్ అన్వేషణ ప్రారంభించింది.

తనతో పాటు ఎమర్జింగ్ మార్కెట్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ విలియం ఈస్టోన్, ఆసియా పసిఫిక్ వీపి డాన్ నీరై భారతదేశంలో తన వారసుడి కోసం అన్వేషిస్తున్నట్లు కీర్తిగా రెడ్డి చెప్పారు. ట్రాయ్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఫేస్‌బుక్ భారతదేశంలో ఫ్రీ బేసిక్స్‌ను మూసేసింది.

Facebook India MD Kirthiga Reddy resigns, to reboot in US

తమ కుటుంబం భారత్‌కు మారినప్పుడు తాము ఏదో ఒక రోజు అమెరికాకు వెళ్లాల్సి ఉంటుందనేది తెలుసునని కీర్తిగా రెడ్డిఅన్నారు. వచ్చే 6- 12 నెలల్లో అమెరికాకు మారనున్నట్లు తెలిపారు. మెన్లో పార్కులోని ఫేస్‌బుక్‌లో కొత్త అవకాశాల కోసం గాలిస్తానని ఆమె చెప్పారు.

నెట్ న్యూట్రాలిటీపై చర్చ ప్రారంభమైన నేపథ్యంలో నెలల తరబడి సంప్రదింపుల ప్రక్రియను కొనసాగించిన ట్రాయ్ ఈ వారం ప్రారంభంలో డాటా యాక్సెస్‌కు ఆపరేటర్లకు భిన్నమైన రేట్లు చార్జ్ చేయడాన్ని రద్దు చేసింది.

English summary
A day after closing down its controversy-ridden Free Basics programme here, Facebook India Managing Director Kirthiga Reddy today stepped down from her current role and will relocate to the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X