వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో FBI సోదాలు... అమెరికా రహస్యాలున్నాయనే..

|
Google Oneindia TeluguNews

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న‌కు చెందిన ''మార్ ఎ లాగో'' ఎస్టేట్ లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను ఇక్కడికి తరలించి దాచివుంటారనే అనుమానంతో ఈ సోదాలు జరిగాయి. అయితే సోదాలను అధికారులు ధ్రువీకరించన‌ప్ప‌టికీ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం సోదాలు జరిగినట్లు వెల్లడించారు.

ఒక్కసారిగా 30 మంది వచ్చారు..

ఒక్కసారిగా 30 మంది వచ్చారు..

అమెరికాకు మాజీ అధ్యక్షుడిగా పనిచేసినవారి ఇల్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది రక్షణలో ఉంటుంది. తనిఖీలు చేయడానికి కొంచెంసేపటి ముందే ఎఫ్‌బీఐ సిబ్బంది సీక్రెట్ స‌ర్వీస్ అధికారుల‌కు విష‌యం తెలియ‌జేయ‌గా వారు కూడా అనుమ‌తించారు. ''30 మంది సిబ్బంది ఒక్క‌సారిగా ''మార్ ఎ లాగో'' ఎస్టేట్‌కు వ‌చ్చార‌ని, వీరు స్థానిక ఎఫ్‌బీఐ కార్యాల‌యం నుంచి రాలేద‌ని.. ఎక్క‌డి నుంచి వ‌చ్చారో మీరు అర్థం చేసుకుంటార‌నుకుంటున్నాన‌ని'' ట్రంప్ కుమారుడు ఎరిక్ వ్యాఖ్యానించారు.

బైడెన్ కు ముప్పుగా ట్రంప్ ను భావిస్తున్నారన్న ఎరిక్

బైడెన్ కు ముప్పుగా ట్రంప్ ను భావిస్తున్నారన్న ఎరిక్

వైట్ హౌస్ నుంచి వారు వచ్చారని, బైడెన్ కు ముప్పుగా భావిస్తున్న ట్రంప్ పైకి వారు దాడికి వచ్చారంటూ ఎరిక్ మీడియాకు తెలిపారు. ట్రంప్ దర్యాప్తునకు ఎప్పటినుంచో సహకరిస్తున్నారని తెలిపారు. గతంలో ట్రంప్ ఇంట్లో 15 బాక్సుల్లో పత్రాలు దొరికినట్లు వచ్చిన వార్తలపై ఎరిక్ మాట్లాడుతూ వైట్ హౌస్ ఖాళీ చేసేందుకు కేవలం ఆరు గంటల సమయం మాత్రమే ఉంటుందన్నారు. ఆ సమయంలో ట్రంప్ వద్ద క్లిప్పింగ్ లను భద్రపరిచామని, అవే ఈ పెట్టెలని తెలిపారు.

 స్పందించిన ట్రంప్

స్పందించిన ట్రంప్

తనిఖీలపై ట్రంప్ స్పందించారు. ఎస్టేట్ ను FBI ఏజంట్లు ఆక్రమించుకున్నారని, ఇది దేశానికి చీకటి సమయం అని అభివర్ణించారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నా అనవసరంగా దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీచేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్న సమయంలో దాడులు జరిగాయి. ఆ సమయంలో ట్రంప్ న్యూయార్క్ లోని ట్రంప్ టవర్స్ లో ఉన్నారు. ''మార్ ఎ లాగో'' ఎస్టేట్ ను ట్రంప్ 1985లో 10 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా 2018 నాటికి దీని విలువ 180 మిలియన్ డాలర్లుగా తేలింది. ట్రంప్ ప్రతి శీతాకాలంలో ఇక్కడే గడుపుతుంటారు. ఇక్కడ ఉన్న గోల్ఫ్ క్లబ్ లో ఎక్స్ క్లూజివ్ సభ్యత్వం 2 లక్షల డాలర్లుగా, సంవత్సర సభ్యత్వం 14వేల డాలర్లుగా ఉంటుంది. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్ లో ట్రంప్ కుటుంబం కోసం కొన్ని భవనాలను కేటాయించారు.

English summary
The staff of the Federal Bureau of Investigation (FBI) carried out inspections in the "Mar a Lago" estate of former US President Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X