ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ: ట్రావెల్ బ్యాన్ బిల్లుకు కోర్టు బ్రేక్

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: వలస విధానాల సంస్కరణలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు, శరణార్థులు అమెరికా రాకుండా ఆయన తీసుకువచ్చిన తాజా ట్రావెల్ బ్యాన్ బిల్లుకు కూడా ఫెడరల్ కోర్టు బ్రేకులు వేసింది.

తొలుత ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ఆయన విధించిన వీసా నిషేధాన్ని న్యాయస్థానాలు కొట్టివేయడంతో... మళ్లీ సరికొత్తగా వీసా నిషేధాన్ని అమలు చేసేందుకు ఆయన సవరించిన మరో బిల్లును సిద్ధం చేశారు. ఈ సారి ఇరాక్‌ను మినహాయించి మిగతా ఆరు దేశాలను వీసా నిషేధిత జాబితాలో చేర్చారు.

Federal judge blocks new travel ban; Trump calls it 'judicial overreach'

ఇరాన్‌, లిబియా, సోమాలియా, సుడాన్‌, సిరియా, యెమన్‌ దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. సరిగ్గా ట్రావెల్ బ్యాన్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగానే.. ఇది చట్టబద్ధంగా లేదంటూ హవాయిలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెర్రిక్ వాట్సన్ నిషేధాన్నినిలిపివేశారు.

ఈ నిషేధం అమల్లోకి వస్తే 'కోలుకోలేని గాయం' తగులుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు అమల్లోకి వస్తే మత సమానత్వం, స్వేచ్ఛను కాపాడే 'ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాస్'ను ఉల్లఘించినట్టేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి ట్రంప్ సందిగ్ధంలో పడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A federal judge in Hawaii blocked President Donald Trump's new travel ban on Wednesday afternoon, hours before the ban was set to go into effect.
Please Wait while comments are loading...