ముగ్గురికి పుట్టిన తొలిబిడ్డ
ఇంగ్లండ్ లో ముగ్గురు వ్యక్తులకు బిడ్డ పుట్టింది. ఐవీఎఫ్ విధానమైన మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్మెంట్(MDT) ద్వారా ముగ్గురి డీఎన్ఏ నుంచి శిశువును పుట్టించారు. తల్లి గుడ్డు నుంచి న్యూక్లియస్ తీసుకున్నారు. దీనిలోని డీఎన్‌ఏ దాత గుడ్డులో అమర్చారు. డొనార్ ఎగ్ న్యక్లియర్స్ తొలగించబడతాయి కానీ దాని ఆరోగ్యకరమైన మైటోకాండ్రియల్ DNA అలాగే ఉంచారు. ఫలితంగా పుట్టిన శిశువు తన DNAలో ఎక్కువ భాగం(99.8 శాతం)తల్లి, తండ్రి నుంచి కలిగి ఉంటే.. దాత నుంచి చాలా తక్కువ మొత్తంలో జన్యు పదార్థం కలిగివుంది.
తల్లుల నుంచి వచ్చే హానికరమైన ఉత్పరివర్తనాలు లేకుండా IVF పిండాలను ఈ పద్ధతి ద్వారా సృష్టిస్తారు. నవజాత శిశువు లోపభూయిష్ట జన్యువులను వారసత్వంగా పొందకుండా ఉంటుంది. వైద్యులు జీవసంబంధమైన తల్లి మైటోకాండ్రియాలో అసాధారణతలను గుర్తించగలిగితే MDT ఒక పరిష్కారంగా ఉంటుందని దీనిద్వారా స్పష్టమైంది.

మైటోకాండ్రియా శిశువుల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
మానవుల్లో 20,000 జన్యువులు ఉన్నాయి. ఇవి పిండ దశలో ప్రధానంగా కేంద్రకంలో కేంద్రీకృతమై ఉండటంతోపాటు ఫలదీకరణం చేసిన గుడ్డులోని ప్రతి కేంద్రకం చుట్టూ వేలాది మైటోకాండ్రియాలు వాటి సొంత జన్యువులను కలిగి ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యవంతమైన పిండంలో మైటోకాండ్రియా ప్రధాన పాత్ర పోషించి కణాలకు శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా అవయవాలను కూడా ఏర్పరుస్తుంది. ఒకవేళ ఇవి దెబ్బతింటే ఉత్పరివర్తనలు కలిగి ఉంటే.. శిశువు పెరిగేకొద్దీ మెదడు, గుండె, కాలేయం, ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం మైటోకాండ్రియల్ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 4,300 జననాలలో కేవలం ఒక్కరినే ప్రభావితం చేయగలుగుతాయి. ఇలాంటి సందర్భాల్లోనే మైటోకాండ్రియల్ డొనేషన్ చికిత్స అనేది శిశువుకు జన్యుపరమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది












Click it and Unblock the Notifications