పామ్ బీచ్‌లో ఓటేసిన మెలానియా -మాస్కు లేకుండానే పోలింగ్ స్టేషన్‌కు -ఇదీ పోలింగ్ సరళి..

చూడబోతే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ టర్నౌట్ రికార్టు స్థాయికి చేరేలా ఉంది. దేశంలో మొత్తం 23.92 కోట్ల మంది ఓటర్లకుగానూ ఇప్పటికే 10 కోట్ల మంది ముందస్తుగా ఓటేయగా.. మంగళవారం నాటి ఎలక్షన్ డే(పోలింగ్) సందర్భంగా ఓటర్లు పోటెత్తారు. 50 రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల వద్ద తెల్లవారు జాము నుంచే సందడి నెలకొంది..

ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రాలకు జనం చేరుకోవడం కనిపించింది. గత ఎన్నికల టర్నౌట్ లో 50 శాతం ఇప్పటికే(ముందస్తు ఓటింగ్ తోనే) చేరగా, మంగళవారం నెలకొన్న జనసందోహాన్ని బట్టి కొత్త రికార్డు నెలకొనే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లి ఓటేసినవారిలో..

First Lady Melania Trump votes in Palm Beach, Florida, but no facemask

అమెరికా ప్రధమ మహిళ, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఉదయం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఓటరైన ఆమె.. అక్కడి బార్బరా మోడల్ రిక్రియేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి బ్యాలెట్ పై ఓటు గుద్దారు. న్యూయార్క్ ఓటరైన ప్రెసిడెంట్ ట్రంప్ ఇదివరకే ముందస్తుగా ఓటేసిన సంగతి తెలిసిందే. అయితే..

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటర్లందరూ మాస్కు ధరించాలన్న ఫెడరల్ అధికారుల సూచనను ఫస్ట్ లేడీ మెలానియా పాటించకపోవడం గమనార్హం. మాస్కు లేకుండానే ఆమె ఓటేసి, ఫొటోలకు పోజులిచ్చారు. తన భర్త డొనాల్డ్ ట్రంప్ రెండో సారి విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నంలోగా ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

First Lady Melania Trump votes in Palm Beach, Florida, but no facemask
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+