మిషన్ మంగళ్: అంతరిక్షాన్నీ వదలట్లేదు: అంగారక గ్రహంపై ఆధిపత్య పోరు: టాప్-3 లిస్ట్
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తోంది. అంగారక గ్రహంపై పెత్తనాన్ని సాగించడానికి మూడు దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రయోగాల మీద ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్స్ కొద్దిరోజుల తేడాతో అంగారకుడిపై ల్యాండ్ కావడం యాదృశ్చికమే అయినప్పటికీ.. దాని తీవ్రతను చాటుతున్నాయి. ఆ మూడు దేశాల దృక్కోణం వేర్వేరుగా ఏమీ లేదు. మార్స్‌పై జీవం ఉందనడానికి, నివాసం ఉండటానికి గల అవకాశాలను పరిశీలిస్తోన్నాయి. కొత్త విషయాలను కనుగొనడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి.
Recommended Video
నాసా హెలికాప్టర్..
అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా పంపించిన ఓ మినీ హెలికాప్టర్.. మంగళవారం అంగారకుడిపై ల్యాండ్ కానుంది. ఆ వెంటనే తన ప్రయోగాలను ఆరంభిస్తుంది. అంగారక గ్రహం ఉపరితలంపై డ్రిల్లింగ్‌ను చేపట్టనుంది. దీని కోసం నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఓ రోబో హ్యాండ్‌ను దీనికి అమర్చారు. 1800 గ్రాముల బరువులో హెలికాప్టర్‌ను పోలి ఉన్న ఈ ల్యాండ్ రోవర్‌ను ఐఐటీ-మద్రాస్ ఆలమ్నీ బాబ్ బలరాం రూపొందించారు. గత ఏడాది టేకాఫ్ అయిన ఈ హెలికాప్టర్ మార్స్‌పై నిర్దేశిత ప్రదేశంలో దిగనుంది. ఆ వెంటనే ప్రయోగాలను చేపడుతుంది. మట్టి, ధూళిని సేకరించి దాన్ని నమూనాలను నాసా గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తుంది.
యూఏఈ హోప్ రోవర్..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపించిన హోప్ రోవర్ కూడా కొద్దిరోజుల కిందటే అంగారక గ్రహం కక్ష్యలోనికి ప్రవేశించింది. ఆ వెంటనే దానికి మార్స్ ఫొటోలను భూమికి పంపించింది. హోప్ పేరుతో ఎమిరేట్స్ పంపించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసిన తొలి ఫొటోను ఎమిరేట్స్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇప్పటిదాకా వెలుగులోకి రాని అంగారకుడి సరికొత్త రూపాన్ని హోప్ స్పేస్‌క్రాఫ్ట్ చిత్రీకరించింది. ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ ఛైర్‌పర్సన్ సారా అల్ అమీరీ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. గత ఏడాది జులైలో ఎమిరేట్స్ ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంగారకుడిపైకి పంపించింది. ఈ నెల 10వ తేదీన అది ల్యాండయింది.
చైనా దూకుడు..
అంతరిక్ష ప్రయోగాల విషయంల చైనా దూకుడు పెంచింది. మార్స్‌పై పరిశోధనలను సాగించడానికి ప్రయోగించిన తియాన్వెన్-1 స్పేస్ క్రాఫ్ట్ వారం రోజుల కిందటే అంగారకుడి కక్ష్యలోనికి ప్రవేశించింది. హోప్ స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించిన రెండు రోజుల తరువాత ఇది ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇది అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. అమెరికా, చైనా, ఎమిరేట్స్ గత ఏడాది జులైలో మార్స్‌పైకి స్పేస్ క్రాఫ్ట్‌లను పంపించగా.. అవన్నీ కొన్ని రోజుల తేడాతో కక్ష్యలోనికి ప్రవేశించాయి. ఈ వారంలో ఈ మూడూ దాదాపు ఒకేసారి అంగారకుడిపై ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
-
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా











Click it and Unblock the Notifications