Flydubai: భారతీయ పైలట్ పై దాడి చేసిన కో పైలట్ కు ఉరిశిక్ష ?

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ (Flydubai)విమానాన్ని కూల్చేందుకు కుట్ర పన్ని, దాన్ని నడుపుతున్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పై హత్యాయత్నానికి విఫలయత్నం చేసిన కోపైలట్ హమమ్ అల్ హమ్మామీకి ఉరిశిక్ష విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విమానంలో దాడి తర్వాత హమ్మామీని సౌదీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత యూఏఈకి అప్పగించారు. దీంతో అక్కడ విచారణలో అతను ఈ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించానని, తనకు ప్రాణభయం లేదని చెప్పేశాడు. ఈ నేపథ్యంలో అతన్ని ఉరితీసేందుకు యూఈఏ సిద్దమవుతోంది.

భారత్ లో అధ్యక్ష ఎన్నికలు-ఓట్లేసిన 12.5 కోట్లమంది-ట్రంప్ విచిత్ర ట్వీట్..!
భారత్ లో అధ్యక్ష ఎన్నికలు-ఓట్లేసిన 12.5 కోట్లమంది-ట్రంప్ విచిత్ర ట్వీట్..!

ఫ్లై దుబాయ్ విమానం FZ1073 కాక్‌పిట్‌ లో జరిగిన దాడికి సంబంధించి కో పైలట్ హమామ్ అల్-హమ్మామీకి మరణశిక్షతో సహా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కోరుకుంటోందని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వైనెట్ తెలిపింది. ఈ దర్యాప్తులో పలువురు ఇజ్రాయెల్ అధికారులు యూఏఈకి సహకరిస్తున్నారని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేసి కో పైలట్ కు ఉరిశిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Flydubai Co-Pilot Faces Death Penalty in UAE Over Pilot Stabbing During Terror Attack
Flydubai:
Flydubai:

సెప్టెంబర్ 30న 174 మందితో దుబాయ్ నుంచి టెల్ అవీవ్ కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కో పైలట్ అల్-హమ్మామీ... కాక్‌పిట్‌లోని అత్యవసర పరిస్దితుల్లో వాడే గొడ్డలితో.. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. భారత పైలట్ తీవ్ర పోరాటం తర్వాత అతి కష్టం మీద కాక్ పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, మరో ఇద్దరు స్టాండ్ బై పైలట్లు లోపలికి వచ్చి అతన్ని కాపాడారు. అలాగే కో పైలట్ హమ్మామీని పట్టుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయానికి తీసుకెళ్లి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనను యూఏఈ ఒక ఉగ్రవాద దాడిగా అభివర్ణించింది. అనంతరం విచారణలో ఆ విమానాన్ని కూల్చివేయాలని తాను కోరుకున్నట్లు అల్-హమ్మామి చెప్పాడు. దీంతో అతని వాంగ్మూలం ఆధారంగానే ఉరిశిక్ష విధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+