కొట్టుకున్న పైలట్లు ? 17,400 అడుగులు జారిన విమానం-హైజాక్ అలర్ట్స్..!

దుబాయ్నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో (Flydubai Flight) అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కాక్ పిట్ లో పైలట్ల వివాదం, ఓ పైలట్ గాయపడటం, తొలుత 7700 అత్యవసర కోడ్, అనంతరం 7500 కోడ్ పంపడంతో హైజాక్‌ భయాలు నెలకున్నాయి. అదే సమయంలో విమానం ఒక్కసారిగా 17400 అడుగుల కిందకు జారిపోయింది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌ వైమానిక దళం యుద్ధ విమానాలను కూడా అప్రమత్తం చేసింది. చివరికి ఈ విమానం అత్యవసర పరిస్థితుల్లో సౌదీ అరేబియాలోని టబుక్‌లో ల్యాండ్ చేశారు.

అమెరికా సైనికుల్ని చంపితే 11 కోట్లు- ఇరాన్ లో సైనికాధికారుల జాడ చెప్తే 143 కోట్లు ..!
అమెరికా సైనికుల్ని చంపితే 11 కోట్లు- ఇరాన్ లో సైనికాధికారుల జాడ చెప్తే 143 కోట్లు ..!

ఇవాళ ఉదయం ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. బయలుదేరిన కాసేపటికే ఈ విమానం ముందుగా సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే 7700 స్క్వాక్ కోడ్‌ను ప్రసారం చేసింది. ఆ తర్వాత విమానం విమానంపై అక్రమ జోక్యం లేదా హైజాక్‌ వంటి పరిస్థితులను సూచించేందుకు వాడే 7500 కోడ్‌కు మారింది. దీంతో ప్రయాణికుల్లో, ఇజ్రాయెల్ లో ఆందోళన మొదలైంది. ఈ విమానంలో పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఇజ్రాయెల్‌ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను పంపింది. అయితే విమానం చివరకు సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

Flydubai Flight Diverts to Saudi Arabia After Hijack Code Pilot Altercation Reported
అరేబియా సముద్రానికి ఇరాన్ వార్..! ట్రంప్ కు ఖమేనీ ఘాటు వార్నింగ్..!
అరేబియా సముద్రానికి ఇరాన్ వార్..! ట్రంప్ కు ఖమేనీ ఘాటు వార్నింగ్..!

తర్వాత వెలువడిన నివేదికలు ఈ ఘటనకు హైజాక్‌ కాకుండా కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ కారణమై ఉండొచ్చని పేర్కొన్నాయి. అయితే గొడవకు అసలు కారణం వెంటనే స్పష్టంగా తెలియలేదు. కొన్ని నివేదికల్లో ఒక పైలట్‌పై కత్తితో దాడి జరిగినట్లు ప్రయాణికులు చెప్పారు. ప్రయాణికులు, సిబ్బంది కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు సమాచారం. CNN నివేదిక ప్రకారం, కాక్ పిట్ గొడవతో విమానం సుమారు 34 వేల అడుగుల నుంచి 16,600 అడుగుల వరకు కేవలం రెండు నిమిషాల్లో దిగినట్లు ఫ్లైట్‌ డేటా సూచించింది. ఈ సమయంలోనే అత్యవసర పరిస్థితికి సంబంధించిన సంకేతాలు వెలువడ్డాయి. అయితే విమానం ఎందుకు అంత వేగంగా దిగిందన్న దానిపై పూర్తి అధికారిక వివరణ రాలేదు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. విమానం టబుక్‌లో ల్యాండ్ అయిన తర్వాత సౌదీ భద్రతా బలగాలు అక్కడ భారీగా మోహరించాయి. విమానంలో ఏం జరిగిందన్న దానిపై విచారణ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+