"వెనుకున్న వారి కథ తేలుస్తాం!".. నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్!

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ చేయడానికి, విమానాన్ని కూల్చివేసేందుకు జరిగిన యత్నం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టి హెచ్చరిక జారీ చేశారు. కాక్‌పిట్‌లోని సహాయ పైలట్ తీవ్రమైన ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు.

స్మిత్ ను చూసి గర్వపడుతున్నా, రియల్ హీరో: మోదీతో పాటు పైలట్‌ను ఆకాశానికెత్తిన ట్రంప్!
స్మిత్ ను చూసి గర్వపడుతున్నా, రియల్ హీరో: మోదీతో పాటు పైలట్‌ను ఆకాశానికెత్తిన ట్రంప్!

భారతీయ కెప్టెన్ సాహసం.. ప్రయాణీకుల అప్రమత్తత
విమానం గాల్లో ఉండగా.. ఇస్లామిక్ రాడికలైజేషన్‌కు గురైన కో-పైలట్ ఒక్కసారిగా కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ.. భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్ సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌ తలుపులను తెరవగలిగారు. దీంతో తక్షణమే స్పందించిన ప్రయాణీకులు.. ఇతర సిబ్బంది లోపలికి ప్రవేశించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. "నన్ను చంపేయండి, చంపేయండి" అని సదరు కో-పైలట్ అరిచాడని, అతడు ఆత్మాహుతి దాడికే సిద్ధపడి వచ్చాడని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.

Flydubai Hijack Attempt Israel PM Netanyahu Issues Warning Indian Captain Saves Passengers Full Details

దాడి వెనుక ఏ దేశమైనా ఉందా? నెతన్యాహు ఆరా
ఈ దాడి వెనుక ఏదైనా విదేశీ శక్తి లేదా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా అనే కోణంలో తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని నెతన్యాహు వెల్లడించారు. "కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఘటనపై స్పష్టత వస్తోంది. అతను ప్రయాణీకులందరితో సహా విమానాన్ని కూల్చడానికి వచ్చాడు. అతడిని ఎవరైనా పంపించారా అనే దానిపై మేము విచారణ జరుపుతున్నాం" అని ఆయన అన్నారు. నెతన్యాహు నేరుగా ఏ దేశం పేరు ప్రస్తావించనప్పటికీ.. గతంలో ఇజ్రాయెల్, అమెరికాలు సైనిక దాడి చేసిన ఇరాన్ వైపే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించా: స్మిత్ కు ప్రధాని మోదీ వీడియో కాల్
ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించా: స్మిత్ కు ప్రధాని మోదీ వీడియో కాల్

ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఘాటుగా స్పందించారు. ఫ్లైదుబాయ్ ఘటనతో ఇరాన్ కు సంబంధం ఉన్నట్లు తేలితే ఆ దేశంపై భారీ దాడి తప్పదని వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోఅమెరికా అదనపు పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను సౌదీ అరేబియా, ఖతార్ లకు తరలించింది. పెంటగాన్ తన విమాన వాహక నౌక "యూఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్"తో పాటు అదనపు దళాలను పశ్చిమాసియాకు పంపినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+