కరోనా మరణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అక్కడ స్మశానాలన్నీ హౌజ్‌ఫుల్..
వైరస్ నిండిన గాలిని శ్వాస ద్వారా లోనికి పీల్చడం ద్వారాగానీ.. వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖంలోని టీ ఆకారాన్ని(కళ్లు, ముక్కు, నోరు) తాకడం ద్వారాగానీ మానవ శరీరంలోకి కరోనా చొరబడుతుంది. ముందుగా గొంతులోకి, తర్వాత శాస నాళాల గుండా ఊపిరితిత్తుల్లో ప్రవేశించి.. మెల్లగా విస్తరిస్తూ మిగతా శరీర కణాలపైనా దాడి చేస్తుంది. మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలోనే విపరీతమైన జ్వరం, దగ్గు. ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి లక్షణాలు బయటపడతాయి. పరిస్థితి చేయిదాటితే గనుక స్పష్టంగా తెలుస్తూనే చావు మనల్ని కబళిస్తుంది. దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు బయటికొచ్చాయి..

చివరి దశకు ఇలా...
ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే.. ముందుగా.. వైరస్ చేతిలో చనిపోయిన వైరస్ ఊపిరితిత్తుల కణాలు.. తెమడ రూపంలో బయటికొచ్చి ఆ ప్రాంతమంతా విస్తరిస్తాయి. ఆ తర్వాత ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు పెరుగుతాయి.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై కోవిడ్-19 వ్యాధి మరింతగా దాడి చేసేకొద్దీ ఊపిరితిత్తుల వాపు పెరుగుతుంది.. న్యూమోనియా కారణంగా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో నీరు నిండిపోయి.. శ్వాస పీల్చడం ఇబ్బందిగా మారుతుంది. ఆ ఇన్ఫెక్షన్ సార్స్‌గా మారి.. కిడ్నీలు పనిచేయడం మానేస్తాయి.. రోగనిరోధకశక్తి పూర్తిగా పడిపోవడంతో బీపీ ప్రమాదకరస్థాయికి పెరుగుతుంది.. ఆలోపే ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేగులు ఇతర భాగాలు పాడైపోతాయి. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన వాపు వలన ‘అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్' తలెత్తి, చివరికి శ్వాసక్రియ ఆగిపోతుంది. ఇలా ఆస్పత్రిలో భయానక పరిస్థితుల్లో ఉన్నవాళ్ల ఫొటోలివి..

కరోనా వార్డులో కదిలించే దృశ్యాలు..
కరోనా మరణాలకు సంబంధించి చైనా కంటే దారుణంగా తయారైంది ఇటలీ పరిస్థితి. ఇప్పటిదాకా చైనాలో 3,249 మంది చనిపోగా, ఇటలీలో ఆ సంఖ్య 3,405కు పెరిగింది. ప్రధానంగా ఉత్తర ఇటలీలోని మిలాన్ సిటీని కరోనా అతలాకుతలం చేసింది. గ్లోబల్ ఫ్యాషన్, ఫైనాన్స్ రంగాలకు హబ్ గా పేరుపొందిన మిలాన్.. ఇప్పుడు భయానకంగా తయారైంది. దానికి సమీపంలోని బెర్గామో సిటీలోనూ వైరస్ విలయతాండవం చేస్తున్నది. అక్కడి పాపా గియోవ్నీ ఆస్పత్రిలో వందల సంఖ్యలో కొవిడ్-19 రోగులు చికిత్స పొందుతున్నారు. ఆ వార్డులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి..

బుడగల హెల్మెట్లు..
కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్నవాళ్లు శ్వాస పీల్చుకోడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో వారికి బుడగల(బబుల్) హెల్మెంట్లు పెట్టి చికిత్స అందిస్తున్నారు. బుడగల హెల్మెంట్లతో పేషెంట్లు బాధపడుతోన్న దృశ్యాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఎప్పుడు ఎవరికి శ్వాస ఆగిపోతుందోన్న కంగారుతో డాక్టర్లు, నర్సులు ఆందోళన చెందుతున్న దృశ్యాలు కన్నీరుపెట్టించేలా ఉన్నాయి. డాక్టర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న తాను ఏనాడూ ఇంతటి భయానక స్ట్రెస్ ఫీలవ్వలేదని పాపా ఆస్పత్రి వైద్యుడు లోరెంజో మీడియాతో అన్నారు.
Recommended Video

స్మశానాల్లో ఖాళీలేదు..
వైరస్ పుట్టిన చైనాలో మరణాలు దాదాపు ఆగిపోయేస్థితికి రాగా.. ఇటలీలో మాత్రం మృత్యువు మరింత కరతాళనృత్యం చేస్తున్నది. మొన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 500 మంది చనిపోయరు. మొత్తంగా గురువారం నాటికి 3,405 మంది కన్నుమూశారు. ఒక్కసారే మరణాల సంఖ్య పెరగడంతో దేశంలోని స్మశానవాటికల వద్ద రద్దీ ఏర్పడింది. ఒక్కో స్మశానంలో రోజుకు కనీసం 24 మందిని ఖననం చేస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి. డాక్టర్ల లాగే కాటి కాపరులు కూడా కంటిమీద కునుకులేకుండా పనిచేస్తున్నారు. ఇటలీలో వైరస్ వ్యాప్తి రేటు అమాంతం పెరిగిన నేపథ్యంలో మరిన్ని వేల చావులు తప్పదనే భావన వ్యక్తమవుతున్నది.












Click it and Unblock the Notifications