రఫాలో యుఎన్‌కు పనిచేస్తున్న భారత మాజీ ఆర్మీ అధికారి మృతి
గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయ మాజీ సైనికాధికారి మృతి చెందారు.
యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (DSS) విభాగంలో పనిచేస్తున్న మాజీ సైనికాధికారి వైభవ్ అనిల్ కాలే(46) తన వాహనంలో రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఆయతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

గాజాలో ఐక్యరాజ్యసమితి భద్రత మరియు భద్రత విభాగంలో పనిచేస్తున్న భారతీయ పౌరుడి మృతికి ఐక్యరాజ్యసమితి మంగళవారం సంతాపం తెలిపింది . సెక్రటరీ జనరల్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ ఒక ప్రకటనలో భారతీయ పౌరుడి మృతికి సంతాపం తెలిపారు.
ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ స్పందించారు. ఐక్యరాజ్య సమితికి చెందిన డీఎస్‌ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించడం చాలా బాధాకం. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి వెళ్లుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాజాలో ఇప్పటివరకు యూఎన్‌కు చెందిన 190 మందికిపైగా సిబ్బంది మరణించారు. మానవతావాదంతో సహాయం చేసే కార్యకర్తలకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలన్నారు. యూఎన్ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications