ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్..!!
ఇస్లామాబాద్: మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఇమ్రాన్ ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సంచలనం సృష్టించిన తోషాఖానా కేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఇమ్రాన్ ఖాన్.. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. మూడు సంవత్సరాల కారాగార శిక్షను విధించింది.
ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశపూరకంగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నకిలీ వివరాలను సమర్పించారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రభుత్వానికి అందిన అత్యంత విలువైన బహుమతులు కూడా ఇమ్రాన్ ఖాన్ అమ్ముకున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌ను దోషిగా నిర్ధారించింది ఆ దేశ న్యాయస్థానం. మూడు సంవత్సరాల కారాగారశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను విధించింది. ఇది- ఇమ్రాన్ ఖాన్ అనర్హతకు దారి తీసింది. అయిదు సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితిని కల్పించింది.
తోషాఖాన కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో- ఆయనను అనర్హుడిగా ప్రకటించింది పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ కార్యాలయం. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్‌పై నేరం నిరూపితమైనందున చట్టాలు, ఎన్నికల నిబంధనలు- మార్గదర్శకాలకు అనుగుణంగా అయిదు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేసినట్లు వివరించింది.
ఇకపై ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాడు. ఇమ్రాన్ ఖాన్ సారథ్యాన్ని వహిస్తోన్న పాకిస్తాన్- తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ పరిస్థితులు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల పీటీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలను తెలుపుతున్నారు. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోన్నారు.












Click it and Unblock the Notifications