299 రోగులపై అత్యాచారం.. చిన్నారులు, అబ్బాయిలే టార్గెట్..!
ప్రజలు వైద్యులను దేవుడితో సమానంగా చూస్తారు. కానీ కొంతమంది అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి కూడా వికృత చేష్టలకు పాల్పడతారు. అలాంటి ఘటనే ఇది. వైద్యుడి ముసుగులో దాదాపు 30 ఏళ్ల సర్వీసులో 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు, అబ్బాయిలు కూడా ఉండటం కలచివేచే విషయం. ఎట్టకేలకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి దాదాపు 3 లక్షలకు పైగా ఫొటోలు, 650 కి పైగా వీడియోలు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ 74 ఏళ్ల నిందితుడిపై విచారణ కొనసాగుతోంది.
మత్తుమందు ఇచ్చి..
ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతానికి చెందిన జోయల్ లే స్కోర్నెక్ .. స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు.చివరగా అతడి అకృత్యాలు 2017లో వెలుగులోకి వచ్చాయి. పక్కింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడం వల్ల జోయెల్‌పై కేసు నమోదైంది.

దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3లక్షలకు పైగా ఫొటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలు, పుస్తకాలను గుర్తించారు. చిన్నారులే టార్గెట్ గా ఆయన అత్యాచార కార్యకలాపాలు కొనసాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆస్పత్రికి వచ్చిన అనేకమంది చిన్నారులకు మత్తు మందు ఇచ్చి శృంగారం జరిపినట్లు గుర్తించారు.
అయితే విచారణలో జోయల్.. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో ఒప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఒకవేళ కోర్టు అతడిని దోషిగా తేలిస్తే 30-40 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications