చైనా విద్యార్థినిపై అత్యాచారం: జర్మనీ విద్యార్థులకు శిక్ష
జర్మనీకి చెందిన ఇద్దరు యువకులకు జర్మనీ కోర్టు జైలు శిక్ష విధించింది. జర్మనీ, చైనాల మధ్య వివాదానికి కారణమైన రేప్ కేసులో జర్మనీ కోర్టు తుది తీర్పును శుక్రవారం నాడు ఇచ్చింది.
బెర్లిన్:జర్మనీకి చెందిన ఇద్దరు యువకులకు జర్మనీ కోర్టు జైలు శిక్ష విధించింది. జర్మనీ, చైనాల మధ్య వివాదానికి కారణమైన రేప్ కేసులో జర్మనీ కోర్టు తుది తీర్పును శుక్రవారం నాడు ఇచ్చింది.
చైనాకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమెను క్రూరంగా హింసించి చంపేశాడు. ఈ ఘటన గత ఏడాది మే మాసంలో పశ్చిమ జర్మనీలో చోటుచేసుకొంది.

ఈ ఘటనపై చైనా తీవ్ర స్థాయిలో స్పందించింది. రెండు దేశాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ కేసు విషయంలో తమకు న్యాయం జరిగే వరకు ఎలాంటి సహయ సహకారాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఉండబోవని చైనా ప్రకటించింది.
దరిమిలా ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనకు కారణమైన ఈ కేసులో జర్మనీ పోలీసులు శరవేగంగా స్పందించారు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఉదా షెమిడిట్ ఈ నేరాన్ని వర్ణించలేమన్నారు.
ఈ సందర్భంగా వారిలో ఒకరికి 15 ఏళ్ళ జైలు శిక్ష, మరోకరికి ఐదున్నరఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే బాధిత కుటుంబానికి 80 వేల యూరోలు చెల్లించాలని కూడ ఆదేశించారు.












Click it and Unblock the Notifications