వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: 106 మంది హత్య.. జర్మనీలో నర్సు దారుణం

నిజానికి ఇద్దరు రోగులపై హత్యాయత్నం కేసులోనే తొలుత ఆమెను అరెస్టు చేసినప్పటికీ ఆ తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి.

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: వృత్తిపరంగా విసిగిపోయిన ఓ జర్మన్ నర్సు దారుణానికి ఒడిగట్టింది. తన అసనహమంతా రోగులపై ప్రదర్శించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 106మంది రోగులను ఆమె బలితీసుకుంది.

నిజానికి ఇద్దరు రోగులపై హత్యాయత్నం కేసులోనే తొలుత ఆమెను అరెస్టు చేసినప్పటికీ ఆ తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి. జర్మనీలోని డెల్మెన్‌ హోస్ట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోన్న ఆమె పేరు నీల్స్ హోగెల్(41).

2015లో ఓ ఇద్దరు రోగులపై హత్యాయత్నానికి పాల్పడి, మరో ఇద్దర్ని హతమార్చిందన్న కేసులో హోగెల్ అరెస్టు అయింది. దర్యాప్తులో 'వైద్య సేవ పట్ల విసుగు చెందడం వల్లే ఈ పని చేశాను' అని నర్సు అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆమె మరో 90మందిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

German killer nurse responsible for more than 100 patient deaths, prosecutors say

దీంతో న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఇంతలోనే మరికొంతమంది బాధితులు మరోసారి కేసును దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో మరో 16మందిని కూడా హోగెల్ పొట్టనబెట్టుకున్నట్టు తేలింది. మొత్తం మీద 1999-2005మధ్య కాలంలో 105మందిని హోగెల్ హతమార్చినట్టు గుర్తించారు.

2005లో ఓ రోగికి ప్రాణాంతక ఇంజెక్షన్ చేస్తున్న సమయంలో మరో నర్సు గుర్తించింది. ఆమె ఫిర్యాదుతో హోగెల్ హత్యాకాండలు వెలుగుచూశాయి.

English summary
A male nurse jailed for life in Germany two years ago for murdering patients with lethal drugs is responsible for the deaths of more than 100 patients, investigators said Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X