Suez Canal Traffic Jam Satellite: ఇరుక్కున్న భారీ ఓడ బయటికి- ఎట్టకేలకు ఫలించిన ప్రయత్నాలు
యూరప్‌నూ, ఆసియా దేశాలనూ కలిపే సూయజ్ కాలువలో కొద్ది రోజుల క్రితం ఓ భారీ నౌక చిక్కుకుపోయింది. ఇది మిగతా నౌకల ప్రయాణాలకు అడ్డంకిగా మారింది. సూయస్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఈ భారీ కంటెయినర్ నౌకను ఎట్టకేలకు పైకి తీసి రూట్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్ధ రాయిటర్స్ ఓ కథనంలో తెలిపింది.
Recommended Video
సూయజ్ కెనాల్‌లో చిక్కుకుపోయిన ఈ భారీ కంటెయినర్ నౌక కారణంగా గంటకు కొన్ని వేల కోట్ల రూపాయల వాణిజ్య నష్టం జరిగింది. ఈ నౌకలో చిక్కుకున్న కంటెయినర్లతో పాటు మిగతా నౌకలు కూడా దారి మళ్లించే అవకాశం కూడా లేకుండా పోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అసలే కరోనా కారణంగా రోడ్డు, వాయు రవాణాలో ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో జల మార్గంలో భారీ ఎత్తున రవాణా సాగుతోంది. ఇదే క్రమంలో సూయజ్ కాలువ గుండా వెళ్తున్న నౌక కొన్ని సమస్యలతో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో పలు దేశాలు వాణిజ్య పరంగా కోట్ల రూపాయల నష్టాల్ని చవిచూశాయి.

మార్చి 23వ తేదీన వాతావరణం సహకరించకపోవడంతో ఈ భారీ నౌక చిక్కుకుపోయింది. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు సరుకుతో బయలు దేరిన ఎంవీ ఎవర్ గివెన్ అనే ఈ భారీ నౌక చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 200 నౌకలు ఎక్కడికక్కడే లంగరేశాయి. దీంతో ప్రపంచదేశాల మధ్య వాణిజ్యానికి బ్రేకులు పడ్డాయి. ఈ భారీ నౌకను బయటికి తీసేందుకు 18 అడుగుల లోతులో ఏకంగా 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వారు. మంగళవారం కల్లా ఈ ఓడ బయటికి రాకపోతే అందులో ఉన్న తమ కంటెయినర్లను అన్‌లోడ్ చేయాలని ఈజిప్ట్ భావించింది. ఓడ బయటికి వచ్చాక పైకి బాగానే కనిపిస్తున్నా ముందుభాగం దెబ్బతిందని తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు నౌక బయటికి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే ఓడ బయటికి వచ్చినా ఇప్పటికే అక్కడజామ్ అయిన దాదాపు 450కి పైగా నౌకలు ఎప్పటికి క్లియర్ అవుతాయో ఇంకా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications