వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల‌క్ష‌కుపైగా ఒమిక్రాన్ కేసులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య‌.. ఆంక్ష‌ల‌వైపు ప్ర‌పంచ దేశాలు

|
Google Oneindia TeluguNews

ప్ర‌పంచ దేశాల్లో ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదయ్యాయి. తాజాగా ఒక్క‌రోజే యూకేలో 15,363 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌తో ఇప్ప‌టివ‌రకు 15 మంది మృతి చెందారు. అటు అమెరికాలో కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అయింది. కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వే అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ల‌క్ష‌కుపైగా ఒమిక్రాన్ కేసులు

ల‌క్ష‌కుపైగా ఒమిక్రాన్ కేసులు


ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన మ‌హ‌మ్మారి క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాలను అత‌లాకుత‌లం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈకేసుల సంఖ్య ల‌క్ష‌కు దాటింది. దీంతో ప‌లు దేశాలు ఆంక్ష‌లు విధించాయి. విమాన రాక‌పోక‌ల‌పై నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

యూకేలో మహమ్మారి విజృంభణ

యూకేలో మహమ్మారి విజృంభణ

యూకేలో క‌రోనా ఒక‌వైపు ఒమిక్రాన్ మ‌రో వైపు విజృంభిస్తున్నాయి. తాజాగా అక్క‌డ ఒక్క‌రోజులోనే 15,363 కేసులు వ‌చ్చాయి. దీంతో యూకేలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 60,508ల‌కు చేరింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక కేసులు న‌మోదు యూకేలో కాగా త‌ర్వాత స్థానంలో డెన్మార్క్ ఉంది. డెన్మార్క్‌లో 26,362, నార్వేలో 3,871, కెనడాలో 2,294, యూఎస్‌లో 1,485, సౌతాఫ్రికాలో 1,444, జర్మనీలో 1,052 కేసులు , భార‌త్‌లో 213 కేసులు న‌మోదు అయ్యాయి. ఒమిక్రాన్ వైర‌స్ తో ఇప్ప‌టి వ‌ర‌కు 15 మంది మృతి

వణికిపోతున్న అమెరికా..

వణికిపోతున్న అమెరికా..

ఒమిక్రాన్ వేరియంట్‌తో అమెరికా వ‌ణికిపోతోంది. దేశ‌వ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు కోవిడ్ బారిన ప‌డుతున్నారు. క‌రోనా పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే కావ‌చ్చ‌ని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి అమెరికాలో ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొంది. అన్యూహంగా ఆరు రెట్లు పెరిగింద‌ని తెలిపింది.

కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వే..

కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వే..


ఒమిక్రాన్ విజృంభ‌ణ‌తో అమెరిక‌న్లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. న్యూయార్కులో కొత్త కేసులు 90 శాతం ఒమిక్రాన్ కేసులుగానే భావిస్తున్న‌ట్లు సీడీఎస్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రాషెల్ వాలెన్ స్కీ పేర్కొన్నారు. గ‌త వారం రోజులుగా మొత్తం 6,50,000 ఒమిక్రాన్ కేసులు న‌మోదయ్యాయ‌ని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఇలాగే కొన‌సాగితే అమెరికా ఆరోగ్య వ్య‌వ‌స్థకు పెనుముప్పు పొంచి ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఆరోగ్య వ్యవస్థకు పెనుప్రమాదం

ఆరోగ్య వ్యవస్థకు పెనుప్రమాదం

న్యూయార్క్‌ ప్రాంతంలో కొత్త కేసుల్లో 90శాతానికిపైగా కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే. గత వారం మొత్తంగా 6,50,000 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ చివరివరకూ నమోదైన కేసుల్లో 99.5 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని వ్యాధి కట్టడి, నివారణ కేంద్రాల(సీడీసీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాషెల్‌ వాలెన్‌స్కీ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా ఆక్రమించి అమెరికా ఆరోగ్య వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించింది.

English summary
omicron case more than one lakh in world wide.. super spread virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X