బంగారు గని కుప్పకూలింది: 12 మంది మృతి

జకర్తా: బంగారు గని కుప్పకూలిపోయి 12 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. అక్రమ తవ్వకాలు జరుపుతుండగా బంగారు గని కూలిపోవడంతో 12 మంది మరణించారని పోలీసులు చెప్పారు.

ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ లో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారందరూ మైనర్లు అని అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. స్థానిక యంత్రాంగం నెల రోజుల క్రితం ఈ బంగారు గనిని మూసి వేసిందని పోలీసులు అన్నారు.

 Gold mine collapse, 12 Killed in Indonesia

అయితే మైనర్లు అక్రమంగా బంగారు గనిలోకి ప్రవేశించి తవ్వకాలు చేపట్టడంతో గని కూలిపోయిందని చెప్పారు. సుమారు 30 మీటర్ల లోతున కూరుకుపోవడంతో ఆక్సిజన్ అందక 12 మంది మరణించారని పోలీసులు అన్నారు.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అంటున్నారు. ఇండోనేషియాలో ఈ మద్య కాలంలో బంగారు గనులలోకి వెళ్లి అక్రమంగా తవ్వకాలు చేపట్టడం ఎక్కువ అయ్యాయని అక్కడి పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+