Google Pay: గూగుల్ సంచలన నిర్ణయం.. గూగుల్ పే సేవలు మూసివేయనున్న కంపెనీ..!
యూపీఐ పేమెంట్ చేయాలంటే మనకు ముందుగా గుర్తొచేవి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం. మొదట్లో గూగుల్ పే వాడేవారికి క్యాష్ బ్యాక్ లు వచ్చేవి. దీంతో గూగుల్ పే వినియోగం భారీగా పెరిగింది. అయితే గూగుల్ పేకు సంబంధించి గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే సేవలు నిలిపివేయాలని డిసైడ్ అయింది.2024 జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు అందుబాటుల ఉండవని ఆ కంపెనీ స్పష్టం చేసింది.
అయితే గూగుల్ పే సేవలు అమెరికాలోనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాలో గూగుల్ పే సేవలు యధావిధిగా ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మూడు నెలల తర్వాత యూఎస్ఏలో గూగుల్ పే సేవలు ఉండవు. అయితే గూగుల్ వాలెట్ సేవలు కొనసాగుతాయని కంపెనీ వివరించింది. యూఎస్ఏలో గూగుల్ వాలెట్ వచ్చిన తర్వాత గూగుల్ పే వాడకం తగ్గిందట. అందుకే గూగుల్ పే సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గూగుల్ పేకు అమెరికాతో పాటు ఇండియా, సింగపూర్ లో భారీగా కస్టమర్స్ ఉన్నారు. గూగుల్ పే సేవలు భారత్, సింగపూర్ లో యధావిధిగా ఉంటాయని గూగుల్ ప్రకటించింది. ఇండియాలో గూగుల్ పే యూజర్లు భారీగానే ఉన్నారు. యూపీఐ యాప్ ల్లో మొదటి స్థానంలో ఫోన్ పే ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో గూగుల్ పే ఉంది. ఇక యూపీఐ పేమెంట్లలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలలో అసాధారణమైన పెరుగుదల నమోదు చేసింది.
డిసెంబర్ 11, 2023 నాటికి 8,572 కోట్లకు చేరుకుంది. ఇది డిజిటల్ లావాదేవీల వైపు గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఈ వృద్ధి పెద్ద ట్రెండ్‌లో భాగం, UPI లావాదేవీలు FY 2017-18లో 92 కోట్ల నుండి 2022-23 FYలో 8,375 కోట్లకు పెరిగాయి. వాల్యూమ్ పరంగా 147% వార్షిక వృద్ధి రేటు (CAGR)ని ఉంది.. యూపీఐ పేమెంట్లు 2017-18లో రూ.1 లక్ష కోట్లు ఉండగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.139 లక్షల కోట్లకు పెరిగింది.












Click it and Unblock the Notifications