యూఎస్ లో గన్ కల్చర్ .. ఒక బాలింత, పసికందుతో పాటు రెండురోజుల్లో 3 ఘటనల్లో 11 మంది మృతి
అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా శని ,ఆదివారాల్లో మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో పదకొండు మంది మృతి చెందారు. సైకోలు తుపాకీలతో వీరంగం వేస్తూ అభం శుభం తెలియని వారి ప్రాణాలను తోడేస్తున్నారు. ఫ్లోరిడా, హోస్టన్, వాషింగ్టన్ లలో జరిగిన ఘటనలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్ లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో స్వైరవిహారం చేయడంతో నలుగురు మృతి చెందారు.

ఫ్లోరిడాలో సైకో కాల్పులు .. ఒక బాలింత, పసికందుతో పాటు మరో ఇద్దరు మృతి
మృతుల్లో ఒక బాలింతతో పాటుగా, ఆమె పొత్తిళ్లలో ఉన్న శిశువు కూడా ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి మరీ ఓ ఇంట్లోకి చొరబడిన సైకో పదకొండేళ్ళ బాలిక, బాలింత తో పాటు ఆమె ఒడిలోని శిశువును హతమార్చాడు. ఇక ఆ పక్కనే ఉన్న మరో ఇంట్లో ఓ మహిళ సైతం ప్రాణాలను కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడిన ఆగంతకుడిపై కాల్పులు జరిపిన పోలీసులు అతడ్ని ప్రాణాలతో పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి పోల్క్ కౌంటీ షెరీఫ్ గ్రేడీ జడ్ మాట్లాడుతూ, 33 ఏళ్ల బ్రయాన్ రిలే అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డారని, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు.

హోస్టన్ లోనూ మరో ఘటన .. నలుగురు కాల్చివేత
అతను తాను చేసిన చర్య ద్వారా తన స్నేహితురాలిని దేవుడి దగ్గరకు పంపించానని, ఇప్పుడు ఆమె దేవుడితో నేరుగా సంభాషించవచ్చని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే హోస్టన్ లో ఆదివారం ఉదయం ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు పెద్దలకు సుమారు 50 ఏళ్ల వరకు ఉంటాయని తెలుస్తోంది. పిల్లల వయసు 10 నుండి 13 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

వాషింగ్టన్ లోనూ కాల్పుల కల్లోలం .. ముగ్గురు మృతి .. ముగ్గురికి గాయాలు
ఇంట్లో గొడవ జరిగిన తర్వాత కాల్పులకు దారి తీసిందని, ఆ తరువాత ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే వాషింగ్టన్ వాయువ్య ప్రాంతం లోనూ శనివారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లాంగ్ ఫెలో వీధిలోని 600 బ్లాక్ లో బ్రైట్ వుడ్ పార్క్ సమీపాన ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
Recommended Video

విపరీతంగా పెరిగిపోతున్న గన్ కల్చర్ .. భయాందోళనలో ప్రజలు
కాల్పులకు పాల్పడిన వ్యక్తి నల్లటి హోండా అకార్డ్ సెడాన్ వాహనంలో వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ వాహన చిత్రాన్నిట్విటర్ లో ఉంచి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అసలు కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరు అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ అమెరికాలో విపరీతంగా పెరిగిపోతున్న గన్ కల్చర్ తో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో యూఎస్ ప్రజలు ఉన్నట్టుగా సమాచారం . రెండు రోజుల్లో మూడు చోట్ల కాల్పులు కలకలం రేపటంతో ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని యూఎస్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications