టీవీ ఛానల్‌పై ఉగ్రదాడి! ఒకరి మృతి, భయంతో పరుగులుతీసిన సిబ్బంది..
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని శంషాద్ టీవీ ఛానల్ పై మంగళవారం ఉదయం ఉగ్రదాడి జరిగింది. ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు బాంబులు, కాల్పులతో విరుచుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు తెలుస
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ ఛానల్‌పై మంగళవారం ఉదయం ఉగ్రదాడి జరిగింది. స్థానిక శంషాద్ టీవీ ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు బాంబులు, కాల్పులతో విరుచుపడ్డారు. ఆ సమయంలో వంద మందికిపైగా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ హఠాత్పరిణామంతో ఛానల్ సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. కొందరు సిబ్బంది ఇంకా భవనం లోపలే ఉన్నారని టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు వార్తలు అందుతున్నాయి.

'ముగ్గురు దుండగులు భవనంలోకి చొరబడ్డారు. ముందు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత లోపలికి వచ్చిన ఆగంతకులు గ్రనేడ్లు విసురుతూ తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు' అని దాడి నుంచి బయటపడ్డ సిబ్బంది ఒకరు చెప్పారు.
దుండగులు దాడి చేస్తుండగా తాను వెనుక డోర్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు.
ఈ దాడిపై సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది టీవీ ఛానల్ భవనం వద్దకు చేరుకుని చుట్టుముట్టారు. దుండగులను పట్టుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది సిబ్బంది దుండగుల అధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications