హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనం
ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.
హెచ్1బీ వీసాదారులకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. అమెరికన్లకే ఉద్యోగాలలో తొలి ప్రాధాన్యత అని ట్రంప్ ఎన్నికల సమయంలో నినదించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఐటీ కంపెనీలకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. హెచ్1బీ వీసాదారులకు కనీస వేతనం లక్షా 30వేల డాలర్లు ఉండాలని చట్టంలో ఉంది. ఈ బిల్లుతో భారత ఐటీ కంపెనీల పైన దెబ్బ పడనుంది. ఈ బిల్లు నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి.












Click it and Unblock the Notifications