భారత్ లో హెచ్1బీ ఉద్యోగుల WFHపై అమెజాన్ కీలక నిర్ణయం-తాజా ఆంక్షలివే..!
అమెరికాలో వలసల్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొంతకాలంగా హెచ్1బీ వీసాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముందుగా హెచ్1బీ వీసాల వార్షిక ఫీజును లక్షడాలర్లకు పెంచేసిన ట్రంప్ సర్కార్.. ఆ తర్వాత విమర్శలు రావడంతో కొత్త వారికి మాత్రమే అమలు చేస్తామని ప్రకటించింది. అనంతరం అసలు హెచ్1బీ వీసా విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించి లాటరీ విధానం రద్దు చేసి వేతనాల విధానం తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో భారత్ కు హెచ్1బీ వీసాల రెన్యువల్ కోసం వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన ఉద్యోగుల విషయంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాగే వారికి పలు సూచనలు కూడా చేస్తున్నాయి. ఇదే క్రమంలో అమెజాన్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేయించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమ ఉద్యోగులు వీసా సంక్షోభం తీరే వరకూ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో వారికి తాత్కాలిక ఊరటనిచ్చింది.

హెచ్1బీ వీసాల రెన్యువల్ కోసం భారత్ కు వచ్చి చిక్కుకుపోయిన ఉద్యోగులకు మరో మూడు నెలల పాటు అంటే మార్చి వరకూ వర్క్ ఫ్రమ్ హోం పొడిగిస్తూ ఇవాళ అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపుతోంది. అయితే దీంతో పాటే వారికి ఆంక్షల్ని కూడా మరింత కఠిన తరం చేస్తోంది. వీటిని పాటిస్తేనే వర్క్ ఫ్రమ్ హోం రాయితీ లభిస్తుందని చెబుతోంది. దీంతో అమెజాన్ ఉద్యోగుల్లో ఇవి టెన్షన్ పెంచుతున్నాయి.

ఈ ఆంక్షల్లో సాంకేతిక సిబ్బందిని కోడింగ్ నుండి నిషేధించారు. ఇందులో ట్రబుల్షూటింగ్, టెస్టింగ్,డాక్యుమెంటేషన్ ఉన్నాయి. అలాగే కస్టమర్ లేదా థర్డ్-పార్టీ ఇంటరాక్షన్ ఉండదు. అలాగే వ్యూహాత్మక వ్యాపార నిర్ణయాలు, వ్యాపార ప్రణాళిక, ఉత్పత్తి నిర్వహణ లేదా నియామక నిర్ణయాలు తీసుకోకుండా నిషేధించారు. ఉద్యోగులు భారతదేశంలోని ఏదైనా అమెజాన్ భవనాలు లేదా సైట్‌లను సందర్శించడానికి లేదా పని చేయడానికి అనుమతించరు. అన్ని పనులు నివాస లేదా అమెజాన్ కాని ప్రదేశం నుండి నిర్వహించాలి. అన్ని సమీక్షలు, తుది నిర్ణయం తీసుకోవడం, సైన్-ఆఫ్‌లు భారతదేశం బయటే చేపట్టాలి.












Click it and Unblock the Notifications