H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!

అమెరికాలో 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ (H-1B Visa)వీసా ఎంపిక నోటీసుల జారీ ప్రారంభమైంది. ఇది వార్షిక లాటరీ ప్రక్రియలో తదుపరి దశ. ఈ నెల 19తో వీసాల రిజిస్ట్రేషన్ ముగియగగా.. ప్రస్తుతం కంపెనీల యాజమాన్యాలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు తమ USCIS ఆన్‌లైన్ ఖాతాలలో అప్‌డేట్‌లను స్వీకరిస్తున్నారు. యూఎస్సీఐఎస్ గతంలో మార్చి 31 నాటికి నోటిఫికేషన్లు పంపుతామని ప్రకటించింది. అయితే మార్చి 27 నాటికే కొంతమంది దరఖాస్తుదారులకు ఎంపికైనట్లు స్టేటస్ చూపిస్తోంది.

H-1B లాటరీ ఫలితం ప్రస్తుతం సాధారణ USCIS కేస్ స్టేటస్ టూల్‌లో కనిపించదు. రిజిస్ట్రేషన్ సమర్పించిన USCIS ఆన్‌లైన్ ఖాతాలో మాత్రమే ఫలితాలు ఉంటాయి. USCIS ఎంపిక నోటిఫికేషన్‌లను యజమానులు లేదా చట్టపరమైన ప్రతినిధులకు ఈ ఖాతాల ద్వారా పంపుతుంది. కాబట్టి అకౌంట్ కు యాక్సెస్ లేని దరఖాస్తుదారులు నేరుగా ఫలితాన్ని తనిఖీ చేయలేరు. స్టేటస్ తెలుసుకోవడానికి నమ్మకమైన మార్గం దరఖాస్తు సమర్పించిన యజమాని, హెచ్ ఆర్ బృందం లేదా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిని సంప్రదించడమే. స్టేటస్ చూసినప్పుడు సెలెక్టెడ్, సబ్మిటెడ్, నాట్ సెలెక్టెడ్ తో పాటు డూప్లికేట్, ఇన్ వాలిడ్ వంటి వివరాలు కూడా కనిపిస్తున్నాయి.

H-1B Visa Status Alert Notices Are Out Who Sees the Results and What to Do If You re Selected

ఒక రిజిస్ట్రేషన్ సెలెక్టెడ్ గా గుర్తిస్తే యజమాని నిర్దిష్ట ఫైలింగ్ విండోలో పూర్తి హెచ్-1బీ పిటిషన్‌ను దాఖలు చేయగలరు. అయితే, సెలెక్టెడ్ అంటే ఆమోదం కాదు. పిటిషన్‌ను సరైన పత్రాలతో సిద్ధం చేసి సమర్పించడం తప్పనిసరి.స్టేటస్ సబ్మిటెడ్ గా మిగిలి ఉంటే, భవిష్యత్తు రౌండ్‌లలో ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. నాట్ సెలెక్టెడ్ అయినవారు ఈ సంవత్సరం క్యాప్‌కు అర్హులు కారు. పిటిషన్ ఫైల్ చేసే యజమానులు మార్చి 2026 నుండి ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు $2,965కి పెరిగిందని గమనించాల్సి ఉంటుందని నిపుణలు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+