హబీబీ.. ఇటు రా చూసుకుందాం!: మైన్‌స్వీపర్ గేమ్‌తో అమెరికాకు ఇరాన్ మాస్ కౌంటర్

అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. మాటల తూటాలు, క్షిపణి దాడులతో రగులుతున్న ఈ పోరులో ఇరాన్ తాజాగా వేసిన ఒక వ్యంగ్యాస్త్రం గ్లోబల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పాపులర్ అయిన 'హబీబీ..' ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని, అగ్రరాజ్యం అమెరికాను నేరుగా టార్గెట్ చేస్తూ ఇరాన్ విసిరిన చాలెంజ్ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

సియెర్రా లియోన్‌లోని ఇరాన్ ఎంబసీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక విచిత్రమైన వీడియోను పోస్ట్ చేసింది. "హబీబీ (అంకిల్ సామ్).. ఇరాన్‌కు రా!" అంటూ అమెరికాను ఉద్దేశించి క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనికి తోడు 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' సముద్ర మార్గం 3D మ్యాప్‌పై 'మైన్‌స్వీపర్' గేమ్ ఆడుతున్నట్లు ఉన్న 35 సెకన్ల యానిమేషన్ వీడియోను జోడించింది. సముద్రంలో తాము అమర్చిన మైన్లను తొలగించడం అంత తేలిక కాదని, ధైర్యముంటే వచ్చి తీయాలంటూ అమెరికా నావికాదళానికి ఇరాన్ బహిరంగంగా సవాల్ విసిరినట్లయింది.

Habibi Come to Iran Tehran Mocks US With Minesweeper Game Video Over Strait of Hormuz Tensions

హోర్ముజ్ వద్ద అసలేం జరుగుతోంది?

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధి ప్రస్తుతం భయం నీడలో ఉంది. ఇటీవలే అక్కడ ఇరాన్ బలగాలు సముద్ర మైన్లను అమర్చేందుకు సిద్ధం చేసిన రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడులు జరిపింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఇరాన్ వేసిన మైన్లను తొలగించామని ప్రకటిస్తూనే, కొత్తగా మళ్లీ మైన్లు అమర్చాలని చూస్తే ఆ పడవలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా హెచ్చరించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణలు క్లైమాక్స్‌కు చేరాయి.

ఆ నాలుగు భారత కంపెనీలపై అమెరికా వేటు, ఇరాన్ చమురు కొంటే అంతే..
ఆ నాలుగు భారత కంపెనీలపై అమెరికా వేటు, ఇరాన్ చమురు కొంటే అంతే..

అమెరికా వార్నింగ్.. ఇరాన్ ప్రత్యారోపణలు!

ఈ ఉద్రిక్తతలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. "ఇరాన్ గనుక ప్రతీకార దాడులకు దిగితే, వారి ఊహకు అందని రీతిలో అంతకంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దెబ్బకి ఇరాన్ ఉనికికే ముప్పు వస్తుంది" అని ఘాటుగా హెచ్చరించారు. మరోవైపు తమ ఎయిర్ డిఫెన్స్, రాడార్ సిస్టమ్స్, నావికా వ్యవస్థలను అమెరికా టార్గెట్ చేసిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించగా, అమెరికా దాడుల్లో ఒక వివాహ వేడుక ధ్వంసమైందని ఇరాన్ మీడియా ఆరోపించింది. అయితే తాము సామాన్యులను ఎప్పుడూ టార్గెట్ చేయమని అమెరికా సైన్యం వివరణ ఇచ్చింది.

ట్రంప్ డిక్లరేషన్.. అది మాదే, మూసేస్తే ప్రపంచానికే ప్రమాదం!
ట్రంప్ డిక్లరేషన్.. అది మాదే, మూసేస్తే ప్రపంచానికే ప్రమాదం!

ముగింపు లేని పోరు!

ఇరాన్ అణు ఆయుధాలు సేకరించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ఆరు నెలలు దాటినా తగ్గడం లేదు. ఒకవైపు క్షిపణుల వర్షం కురుస్తుంటే, మరోవైపు ఇలాంటి డిజిటల్ మాక్ వార్స్ శత్రుత్వానికి మరింత నెయ్యి పోస్తున్నాయి. సముద్ర మార్గాల్లో బాంబుల ముప్పు పెరగడంతో అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+