మోడీ చేయాల్సింది చేశారు, ఇప్పుడు మాదే: హఫీజ్ సయీద్ వార్నింగ్
లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి పిచ్చికూతలు కూశాడు. భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించాడు.
భారత్‌కు తగిన సమాధానమిచ్చేలా మెరుపు దాడులకు కాశ్మీరీ ఉగ్రవాదులు (ముజాహిదీన్) ప్రణాళిక రూపొందిస్తున్నట్లు హఫీజ్ చెప్పాడు. ఈ దాడులు భారత్ చేసినట్లుగా ఆషామాషీగా ఉండవని హెచ్చరికలు చేశాడు.

'మోడీ చేయాల్సింది ఆయన చేశారు. కాశ్మీర్‌లో మెరుపుదాడులకు ఇప్పుడు ముజాహిదీన్ వంతు వచ్చింది.' అంటూ హెచ్చరించాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్పూర్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో హఫీజ్ ఇలా రెచ్చిపోయాడు. ఈ సందర్భంగా అనుచరులతో పెద్దఎత్తున 'జిహాద్' నినాదాలు చేయించాడు.












Click it and Unblock the Notifications