హైతీలో భారీ భూకంపం: 300 మందికిపైగా మృతి, 2వేల మందికి గాయాలు, కుప్పకూలిన భవనాలు
హైతీ: కరీబినయన్ దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. రిక్టార్ స్కేలుపై 7.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పెద్ద ఎత్తున నివాసాలు కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. భవనాల కింద అనేక మంది చిక్కుకుపోయారు.
⭕️#Earthquake M7.2, #HAITI REGION, Sat 14 Aug 2021 12:29:10 pic.twitter.com/X5SfvRsaDP
— 🅻-🆃🅴🅰🅼 (@L_Team10) August 14, 2021

హైతీ భూకంపం: 304 మంది మృతి, 1800 మందికిపైగా గాయాలు
ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు 304 మంది మరణించినట్లు హైతీ అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు 2వేల మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్ తోపాటు సమీప ప్రదేశాల్లో భూ ప్రకంపనాలు వచ్చాయి.

కొనసాగుతున్న సహాయక చర్యలు
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్ జియోలాజికల్ సర్వే అనంతరం ఉపసంహరించుకుంది. హైతీ రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు 125 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ హైతీలో సెయింట్ లూయిస్-డు-సుడ్ కు 12 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

హైతీ భూకంపం: భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
ఈ భూకంపం దేశంలోని పలు చోట్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించినట్లు హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ తెలిపారు. భూప్రకంపనల దాటికి పలు చోట్ల భవనాలు, వేల సంఖ్యలో ఇళ్లు కుప్పకులాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గాయపడినవారిని విపత్తు, సహాయక బృందాలు సమీపం ఆస్పత్రులకు తరలించాయి.
Recommended Video

నెలరోజులపాటు అత్యవసర పరిస్థితి.. జో బైడెన్ హెల్ప్
నెలరోజులపాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని హెన్రీ ప్రకటించారు. బాధితులకు సహాయం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలియజేశారు. హైతీకి సాధ్యమైనంత త్వరగా సాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను ఆదేశించారు.
దీంతో అమెరికా అధికారులు రంగంలోకి దిగారు. కాగా, హైతీలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. 2010లో కూడా రిక్టార్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ నష్టాన్నే మిగిల్చింది. అప్పుడు సుమారు 2 లక్షల మందికిపైనే మృత్యువాతపడ్డారు. దాదాపు 3 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. భారీ ఎత్తున భవనాలు కుప్పకూలిపోయాయి. అనేక విపత్తుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశానికి తాజా భూకంపం మరోసారి కోలుకోలేని దెబ్బతీసింది.
-
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications