వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ట్రంప్ బర్త్ డే నిర్వహించిన హిందూ సేన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలవాలని గతంలో పూజలు చేసిన హిందూ సేన ఇప్పుడు ఆయన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. రిపబ్లికన్ తరపున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. డెమోక్రటిక్ నుంచి హిల్లరీ క్లింటన్ బరిలో నిలవనున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం నాడు హిందూ సేన ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించింది. మానవజాతి సంరక్షకుడుగా ట్రంప్‌ను అభివర్ణిస్తూ వేదికపై ఏడు కిలోల కేక్‌ను కార్యకర్తలు కట్ చేశారు. గన్ పట్టుకుని ఉన్న ట్రంప్ బ్యానర్‌కు కేక్ తినిపించారు.

Happy Birthday Donald Trump – Hindu Sena cuts cake for 'messiah against Islamic terror'

వేదికను బెలూన్లు ఏర్పాటు చేశారు. ట్రంప్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రాసి పెట్టారు. ట్రంప్ చిత్రం పైన 'హ్యాపీ బర్త్ డే, లాంగ్ లివ్ ట్రంప్ అని రాశారు. వేడుకలకు ముందు వారు ఓర్లాండో ఘటనలో మృతి చెందిన బాధితుల ఆత్మశాంతి కోసం నిమిషం పాటు మౌనం పాటించారు.

హిందూసేన చీఫ్ విష్ణు గుప్తా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ తమ హీరో అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తుద ముట్టించాలని పిలుపునిచ్చిన సాహసి ప్రపంచంలో ఒకరేనని కితాబిచ్చారు. ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ కఠిన వైఖరి భారత్‌కు చాలా కీలకమన్నారు. భారత్ కూడా టెర్రరిజం బాధిత దేశమన్నారు. ట్రంప్ మానవాళి సంరక్షకుడన్నారు.

English summary
Little-known right wing group Hindu Sena on Tuesday celebrated US Republican party candidate Donald Trump’s birthday at Jantar Mantar in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X